డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే | Swine flu to Deputy CM Mohammed Ali | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే

Published Mon, Jan 30 2017 12:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే - Sakshi

డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే

  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • రాష్ట్రంలో పోలియో నియంత్రణలో ఉంది
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి  
  • హైదరాబాద్‌: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. గత రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్యతో పాటు మరణాల శాతం కూడా బాగా తగ్గిందని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిని నయం చేసేందుకు అన్ని రకాల వసతులు, మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పోలియోపై పూర్తి స్థాయిలో నివారణ ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

    కిడ్నీ బాధితులకు ఉచిత మందులు
    కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితకాలం ఉచితంగా మందులు అందిస్తా మని, త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తా మని లక్ష్మారెడ్డి తెలిపారు. మరో 40 డయాల సిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అగర్వాల్‌ సమాజ్‌ సహాయతా ట్రస్ట్‌ రూ.70 లక్షలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు.

    అనంతరం లక్ష్మారెడ్డి మాట్లా డుతూ ప్రస్తుతం సుమారు 8 వేల మంది కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలు అంది స్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నాన్‌ కమ్యూని కబుల్‌ డిసీజెస్‌ సెంటర్లనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. నిరుపేద రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన  ట్రస్ట్‌ నిర్వాహకు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ కార్య దర్శి రాజేశ్వర్‌ తివారీ, డీఎంఈ రమణి, గాంధీ్ర పిన్సిపాల్‌ బీవీఎస్‌ మంజుల, సూప రింటెండెంట్‌ జేవీ రెడ్డి, అగర్వాల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు కరోడిమల్‌ అగర్వాల్, రాజేష్‌ కుమార్, కపూర్‌చంద్, నరేశ్‌కుమార్‌ చౌదరి, దుర్గాప్రసాద్‌ నరెటా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement