పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించినట్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార‍్య.. తండ్రికి కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆమె సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్.
లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి సమయంలో ఆయన సన్నిహితుడు భోలా యాదవ్, కుమారుడు తేజస్వీ యాదవ్, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమార్తే మిసా భారతిలు సింగపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం తన కూతురితో కలిసి సింగపూర్ వెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆయన కుమార్తె రోహిణి నిర్ణయం తీసుకున్నారు.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
ఇదీ చదవండి: ‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి’: కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment