
సందీప్‌తో భార్య సునీత, తల్లి నాగమణెమ్మ
సాక్షి,కాజీపేట అర్బన్: మూడు చక్రాలు తిరిగితేనే ఆ కుటుంబం మూడుపూటలా కడుపునిండా తినేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ.. ఆనందంగా గడుపుతున్న చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తికి రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచిన స్థితిలో పడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా కాజీపేటలోని రామాలయం వీధికి చెందిన మునిగాల జాకోబ్ యాదయ్య, నాగమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా, తండ్రి యాదయ్య 2010లో కాలం చేయగా.. చిన్న కుమారుడు మునిగాల సందీప్ తన తండ్రి నుంచి వారసత్వంగా ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. 2014లో ఖమ్మం జిల్లాకు చెందిన సునీతను సందీప్ వివాహం చేసుకున్నాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్.. మంచిదేనా? )
2016లో కుటుంబంలో కిడ్నీ భారం..
ఆనందంగా సాగుతున్న సందీప్ జీవితానికి కిడ్నీ సమస్య శాపంగా మారింది. 2016 మార్చి నెలలో శరీరంలో పలు మార్పులు వస్తుండడంతో సందీప్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా, కిడ్నీలు 70 శాతం మేర శక్తిని కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నాటి నుంచి రెండు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
ఒక రోజు ఆటో.. మరో రోజు డయాలసిస్..
సందీప్ ఆటో నడిపితేనే గాని కుటుంబం గడవని స్థితి. దీనికితోటు డయాలసిస్ తప్పనిసరి. దీంతో ఒక రోజు ఆటోనడపగా వచ్చిన డబ్బులకు తోడు అప్పలు చేసి కుటుంబాన్ని పోషించడంతోపాటు డయాలసిస్ చేయించుకునేవాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రతీసారి డయాలసిస్, మందులకు కలిపి సుమారు రూ.10 నుంచి రూ.15వేల ఖర్చు అవుతుంది. తల్లి నాగమణెమ్మ తెలిసివారి దగ్గర అప్పులు చేస్తూ కొడుకు ఆరోగ్యం బాగుపడాలని ఖర్చు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఒంట్లో సత్తువను కోల్పోయిన సందీప్ ఏడాది నుంచి మంచానికే పరిమితమైపోయాడు. దీంతో భార్య సునీత, తల్లి నాగమణమ్మ సందీప్‌కు మంచంపైనే సపర్యలు చేస్తున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85 )
డిసెంబర్‌లో కిడ్నీ మార్పిడి
సందీప్‌కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో తల్లి నాగమణెమ్మ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.7 నుంచి రూ.10లక్షల ఖర్చు అవుతుందని, డిసెంబర్‌లో చేయించుకుంటేనే ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆటో నడిపే పరిస్థితి లేదు.. మరో వైపు అప్పుల భారం.. దిక్కుతోచని స్థితిలో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.
దాతలారా.. స్పందించండి
అకౌంట్ నంబర్ 261313898
కొటక్ మహీంద్రబ్యాంక్
కేకేబీకే0000572
వరంగల్
ఫోన్ పే నంబర్ : 70322 22148
Comments
Please login to add a commentAdd a comment