తమిళ సినిమా : ఆరోగ్యం క్షీణించడంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేక బాధపడుతున్నానని కాబట్టి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిందిగా బహుభాషా నటుడు పొన్నంబళం వేడుకుంటున్నారు. తెలుగు, తమిళం మొదలగు పలు భాషల్లో వివిధ పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం. కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్య చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సినీరంగంలోని ప్రముఖులను ఆర్ధిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఐదేళ్లుగా తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రాణాన్ని నిలుపుకోవడానికి పోరాడుతూ వచ్చానన్నారు.
అయితే ప్రస్తుతం ఆ ప్రమాదం నుండి గట్టెక్కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమయ్యానని పొన్నంబళం తెలిపారు. తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందన్నారు. ఇప్పటికే నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఆర్ధిక సహాయం చేశారని తెలిపారు. కాగా ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు ఆర్థిక సాయం అవసరం ఉందని, దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు.
చదవండి: చారిత్రాత్మక సినిమాలో సూర్య
జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment