ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు.
సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు.
పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు.
రెడ్డిట్‌లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్‌కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు.
చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా?
Comments
Please login to add a commentAdd a comment