దేశవ్యాప్తంగా 2023లో మొత్తం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కేసులు 13,426
ఆంధ్ర ప్రదేశ్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కేసులు 422
మారుతున్న వాతావరణం, జీవనశైలి కారణంగా దేశంలో కిడ్నీ వ్యాధులు ఏటా పెరిగిపోతున్నాయి. అవయవాలు పాడై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిలో అత్యధిక శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కిడ్నీ మార్పిడి(ట్రాన్స్‌ప్లాంట్) కేసుల్లో వృద్ధి నమోదవుతూ వస్తోంది. 2013లో దేశవ్యాప్తంగా 4,037 కిడ్నీ మార్పిడి కేసులు నమోదు కాగా... ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023 సంవత్సరానికి ఏకంగా 1,3426కు చేరింది. – సాక్షి, అమరావతి
నేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్(నోటో) విడుదల చేసిన 2023 వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది దేశం మొత్తం 16,542 అవయవ మార్పిడి కేసులు నమోదు కాగా, అందులో 81 శాతం.. అంటే 13,426 కిడ్నీ మార్పిడి కేసులే ఉండటం గమనార్హం. మొత్తం కిడ్నీ మార్పిడి కేసుల్లో 11,791 రక్తసంబంధికులు కిడ్నీలు దానం చేయగా, 1,635 కేసుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
2023లో కిడ్నీ గ్రహీతల్లో ఎవరు ఎంతమంది అంటే..
పురుషులు: 8,486 (63%) మహిళలు: 4,939 (37%) ట్రాన్స్‌జెండర్: 1
Comments
Please login to add a commentAdd a comment