భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
Published Fri, Jan 6 2017 4:30 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
కంబదురు: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం నూతిమడుగులో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వడ్డె హనుమంతు, జయమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన హనుమంతు(38) ఈ రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement