భార్య ఆత్మహత్య చేసుకోవడంతో వియోగాన్ని భరించలేని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తిరుత్తణి: భార్య ఆత్మహత్య చేసుకోవడంతో వియోగాన్ని భరించలేని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెయ్యూరు తాలుకా కొడుక్కుత్తూరుకు చెందిన తిరువేంగడం. ఇతని కొడుకు భాగ్యరాజ్(32). బిటెక్ చదువుకున్న భాగ్యరాజ్ విశాఖపట్నంలో ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. ఇతనికి ఐదేళ్ల క్రితం భువనేశ్వరితో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.
అనంతరం భాగ్యరా జ్, తన సొంత ఊరికి చెందిన అన్భళగన్ కూమార్తె విజయలక్ష్మి(28)ని ప్రేమించాడు. విజయలక్ష్మి చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాల్గొవ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని మార్చి మూడవ తేదీ చెన్నైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విజయలక్ష్మి తండ్రి అన్భళగన్ వీరి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో విజయలక్ష్మి మూడవ తేదీ హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలిసిన ఆమె భర్త భాగ్యరాజ్ దిగ్భ్రాంతి చెందాడు. భార్య వియోగం భరించలేని భాగ్యరాజ్ తిరుత్తణికి వచ్చి స్థానిక బస్టాండులోని ఓ ప్రైవేటు లాడ్జిలో బస చేశాడు. బుధవా రం రాత్రి లాడ్జి రూమ్‌లో జరిగిన విషయూన్ని లెటర్ రాసిపెట్టి, తన జీన్స్ ప్యాంట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన తిరుత్తణి ఇన్‌స్పెక్టర్ శిఖామణి భాగ్యరాజ్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.