జైపూర్లో భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య | Man kills wife, commits suicide Jaipur | Sakshi
Sakshi News home page

జైపూర్లో భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య

Published Thu, Dec 26 2013 3:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Man kills wife, commits suicide Jaipur

జైపూర్: కుటుంబ వివాదంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన భార్యను పదునైన కత్తితో పొడిచి చంపి, ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జైపూర్లోని హనుమాన్గఢ్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్లోని హనుమాన్గఢ్లో విజయ్ (37), రజనీ (35) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 12 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.

దంపతులిద్దరూ ఇంట్లో తరుచూ గొడవ పడేవారు. వీరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో మనస్తాపం చెందిన భర్త విజయ్ తన భార్య రజనీని ఓ పదునైన కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తాను కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు.  రజనీ తండ్రి ఉదయం వారి ఇంటికి వచ్చిన సమయంలో వారి మృతదేహాలను చూసి నివ్వెరపోయాడు. దీంతో అతను  పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement