
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిలకలగూడ: భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన శ్రీకాంత్, సరిత భార్యాభర్తలు. వాటర్ ఫ్యూరిఫైర్ బిజినెస్ చేస్తున్న శ్రీకాంత్ తన ఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను ఎప్పుడు యాక్టివేట్‌లోనే ఉంచుతాడు. శ్రీకాంత్ కాల్ రికార్డింగ్‌లను విన్న సరిత భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయమై శుక్రవారం ఉదయం ఇరువురి మధ్య తగాదా జరిగింది.
బిజినెస్ పనిమీద శ్రీకాంత్ బయటకు వెళ్లగా సరిత ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సరిత ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు ముప్పిడి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు.
చదవండి: బాలికను వంచించి.. గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్..
Comments
Please login to add a commentAdd a comment