sanat nagar
-
సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి..
నగరంలోని ఆదివారం అంగడికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ షాపింగ్ చేసేలా కాటుక బరణి నుంచి కార్ టైర్ల వరకూ అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్‌కు రాను రానూ క్రేజ్ పెరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు, మధ్యతరగతి పాలిట ‘సంత’సాన్ని నింపుతోంది. ఈ ఓపెన్ మాల్.. శ్రీమంతులకు ఆటవిడుపు.. ఆదివారం సూర్యోదయం కాకమునుపే ‘గిట్టుబాటు’ అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీపడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు. కానీ, వారికి ఈ సెలవు రోజే బతుకు దెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలు.. ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకూ విస్తరిస్తూ పోతోంది..దీని గురించిన మరిన్నివివరాలు.. – సనత్నగర్శతాబ్దం కాలం క్రితం 15–20 దుకాణాలతో మొదలైన సంత నేడు దాదాపు వెయ్యి మంది చిరువ్యాపారులకు బతుకుదెరువుకు కేంద్రంగా మారింది. రోడ్డే ఈ సంతకు అడ్డా. నాడు ఎర్రగడ్డ చౌరస్తాకే పరిమితమైన వ్యాపారాలు నేడు కిలోమీటరు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా నుంచి మొదలుకొని సనత్‌నగర్ బస్టాండ్ వరకూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇన్ వన్ అంగడి.. చిన్నా.. పెద్దా మాల్ అనే తేడా లేదు.. వాటిల్లో ఉండే ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. స్రూ్కడ్రైవర్ నుంచి సూట్‌కేస్ వరకూ.. రెడీమేడ్ దుస్తుల నుంచి రేబాన్ గ్లాసెస్ వరకూ, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట»ొమ్మల వరకూ, నాటి గ్రామ్‌ఫోన్‌ల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకూ.. ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎరగ్రడ్డ–సనత్‌నగర్ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది.‘సెకండ్స్’కు పెట్టింది పేరు.. ఎర్రగడ్డ సంత అంటే వస్తువులు ‘సెకండ్స్’లో అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో పాటు వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ఫ్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రికల్, ఐరన్ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్లో లభిస్తాయి. ఇక ప్రొక్లెయినర్ నుంచి మొబైల్ ఫోన్ వరకూ.. ఎలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావాల్సిన విడి భాగాలు (స్పేర్‌పార్ట్స్)కు ఈ సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్. నగరం నలుమూలల నుంచి..కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి ఈ మార్కెట్‌ను సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30–40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారని ఓ అంచనా. సీజనల్ వ్యాపారాలకు ఊపునిస్తూ..చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా జరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లు రోడ్లపై గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, రంగురంగుల గొడుగులతో మార్కెట్ నిండిపోతుంది. వేసవి వచి్చందంటే కాటన్ దుస్తుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.వందేళ్ల చరిత్రకు సాక్ష్యం..రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ వందేళ్ల చిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్ నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వరకూ పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయవిక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడి పశువులను సంతను మోతీనగర్ సమీపంలోని బబ్బుగూడకు తరలించారు. సాధారణ మార్కెట్ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు..వివిధ జాతులకు చెందిన పిల్లులను తెచ్చి అమ్ముతుంటాను. ఎప్పటికప్పుడు తన వద్దకు వచ్చే కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు పెంపుడు జంతువులు తెస్తుంటాం. ఆదివారం వచి్చందంటే ఇక్కడ వ్యాపారం తప్పనిసరి. ఇదే మా కుటుంబ పోషణ.– ఖాన్, వ్యాపారిస్పేర్ పార్ట్స్ కోసం.. మొబైల్ ఫోన్‌కు అవసరమైన స్పేర్‌పార్ట్స్ కోసం ఎల్బీనగర్ నుంచి వచ్చా. ఇక్కడ మార్కెట్లో ఏది కావాలన్నా దొరుకుతుంది.. మొదటిసారి ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ ఇక్కడ చూశాను. – మహేష్ ఎల్బీనగర్ -
వీడిన మిస్టరీ.. ప్రాణాలు మింగేసిన గీజర్
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ జెక్ కాలనీలో బాత్రూంలో ముగ్గురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన ఘటనలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు గ్యాస్ ఆధారిత గీజర్ వాడుతుండేవారని, అదే వారి పాలిట మరణశాసనమైందని తెలుస్తోంది. దీని నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చా రు. ఈ వాయువును పీలి్చన ఐదు నిమిషాలకే స్పృహ తప్పిపడిపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. గీజర్ నుంచి ఇలాంటి విషపూరితమైన వాయువులు ఎలా వెలువడుతాయో తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వెంటిలేషన్ లేకపోవడం వల్లే.. సాధారణంగా స్నానాల గదుల్లో గాలి, వెలుతురు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గ్యాస్ ఆధారంగా పనిచేసే గీజర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కిచెన్లలో కూడా గీజర్లను బిగిస్తుంటారు. బాత్రూమ్లో కానీ, కిచెన్‌లో కానీ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వెంటిలేటర్లు బిగించినప్పుడు ఎప్పుడూ తెరిచి ఉండేలా చూసుకోవాలి. గీజర్ ఆన్ చేసుకున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచుకోవాలి. గీజర్‌ను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీక్ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే రిపేర్ చేయించాలి. రోజంతా గీజర్ ఆన్ ఉండొద్దు.. గీజర్‌ను ఎట్టిపరిస్థితుల్లో కూడా రోజంతా ఆన్ చేసి ఉంచకూడదు. ఆన్‌చేసి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవసరం ఉండి నిత్యం వాడాల్సి వస్తే మాత్రం మధ్యలో కాసే పు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేసుకోవాలి. బాత్రూమ్లోకి వెళ్లే ముందు గీజర్‌ను ఆఫ్ చేసుకుంటే మంచిది. అప్పుడు ప్రమాదాలు జరిగే చాన్స్ తక్కువగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం గ్యాస్ గీజర్ లోపల కాలినట్లయితే..అందులో నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్ రంగు, వాసన ఉండదు. దీంతో అది విడుదలైనట్టు కూడా గుర్తుపట్టడం కష్టం. అది పీల్చుకున్న వారి మెదడుపై నేరుగా చాలా తక్కువ సమయంలోనే ప్రభావం చూపుతుంది. దీంతో ఐదు నిమిషాల్లోనే స్పృహ తప్పిపోతుంటారు. ఎక్కువగా కనుక పీల్చుకుంటే ప్రాణాలకే ప్రమాదం. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్‌పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు -
ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా
సనత్‌నగర్: ఒంటికాలితోనే మహిళల ప్రత్యేక సోలో కేటగిరి సైక్లింగ్ రేస్‌లో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ పూర్తి చేస్తానని పారా అథ్లెట్ గీతా ఎస్.రావు ధీమా వ్యక్తం చేశారు. ఎడమ కాలు పోలియో వ్యాధికి గురైనప్పటికీ ఆమె ఒక కాలుతోనే సైకిల్ తొక్కుతూ ఇప్పటికే డీఎస్ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్‌గా నిలిచారు. సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా నిలోఫర్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18,950 కిలోమీటర్ల ఎత్తులో, 3,651 కిలోమీటర్ల పొడవైన ఈ ఐకానిక్ సైకిల్ రైడ్ మార్చి 1న శ్రీనగర్ నుంచి ప్రారంభమై కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్ రేస్‌లో భాగంగా దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు. 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ రేస్‌కు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అధికారిక భాగస్వామిగా ఉందన్నారు. తన రైడ్‌లో భాగంగా ‘తల్లి పాలే ఉత్తమ ఆహారం’ అనే నినాదంతో దేశంలో తల్లి పాలపై అవగాహనను పెంపొందించేందుకు ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ క్రాలేటీ, నియోనాటాలజీ హెచ్ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలవలపల్లి దుర్గాభవానీ, అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి తదితరులు పాల్గొన్నారు. -
వీడని మిస్టరీ.. 50 రోజులైనా లభించని మహిళా లోకో పైలెట్ ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్లో అదృశ్యమైన లోకో పైలట్ వాసవి జాడ ఇంకా లభించలేదు. వాసవి ఆచూకీ కోసం పోలీసులు 50 రోజులుగా గాలిస్తున్నారు. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు వంటి ఇతర గాడ్జెట్ ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఆమె ఆచూకీ కనుగొనడం మరింత ఆలస్యం అవుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి సనత్‌నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్ వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూడగా, ఫోన్ రూమ్‌లోనే ఉంది. కానీ ఆమె లేదు. దీంతో తండ్రి భాస్కర్ రావు తన కూతురు అదృశ్యంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె కనిపిస్తే సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం -
710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్‌ఐసీయూలోనే
సాక్షి, హైదరాబాద్: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీ పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు. పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్‌కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు. -
ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో..
సాక్షి, చిలకలగూడ: భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన శ్రీకాంత్, సరిత భార్యాభర్తలు. వాటర్ ఫ్యూరిఫైర్ బిజినెస్ చేస్తున్న శ్రీకాంత్ తన ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను ఎప్పుడు యాక్టివేట్‌లోనే ఉంచుతాడు. శ్రీకాంత్ కాల్ రికార్డింగ్‌లను విన్న సరిత భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయమై శుక్రవారం ఉదయం ఇరువురి మధ్య తగాదా జరిగింది. బిజినెస్ పనిమీద శ్రీకాంత్ బయటకు వెళ్లగా సరిత ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సరిత ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు ముప్పిడి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: బాలికను వంచించి.. గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్.. -
నవంబర్ 15న బంజారాహిల్స్‌తోపాటు ఈ ప్రాంతాలకు నీళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న సోమవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పంజగుట్ట శ్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడున్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌ను మరోచోటకు మార్చాల్సిన నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపింది. నిర్వహణ డివిజన్ 6లో ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్ల పరిధిలోని ప్రాంతాల్లో, నిర్వహణ డివిజన్ 9లో మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగానగర్, కబీర్‌నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. నిమ్స్‌కు నీటి సరఫరా బంద్ నిమ్స్‌కు 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి శుక్రవారం నిమ్స్ యాజమన్యానికి సర్కులర్ జారీ చేసింది. ఈ నెల 15వ తేది సాయంత్రం నుంచి 16వ తేది రాత్రి వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 24 గంటల పాటు శ్రస్త చికిత్సలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. -
పెళ్లై ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని!
సాక్షి, సనత్‌నగర్: నవవధువు హత్యకు గురైంది.. కట్టుకున్న భర్తే కాలయముడై కడతేర్చాడు.. తరచూ భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలకు తోడు భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. నిజామాబాద్ దర్పల్లికి చెందిన మానస(24)కు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(34)తో గతేడాది నవంబర్ 20న వివాహం జరిగింది. 3నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పలుమార్లు ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మానస, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్‌పై 498 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆ దంపతులు కలిసి జీవించేందుకు సమ్మతించారు. అయినా గొడవలు కొనసాగుతుండటంతో మానస పుట్టింటికి వెళ్లిపోయింది. గంగాధర్ ఒక్కడే మూసాపేట జయప్రకాష్‌పగర్‌లో గదిని అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చదవండి: సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ మరింత ఆవేశానికి లోనై.. ఇదిలా ఉండగా, 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి హనుమంతు చనిపోయాడు. విషయం తెలుసుకున్న మానస జగద్గిరిగుట్టలోని అత్తింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భార్యను గంగాధర్ మూసాపేటలోని తాను ఉండే ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే మానస గర్భవతి అయ్యిందని ఆమె తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని భార్యను ఆదివారం రాత్రి నిలదీశాడు. తనకు ప్రెగెన్నీ వచ్చిందని, తీయించేసుకున్నానని చెప్పడంతో మరింత ఆవేశానికి లోనైన గంగాధర్ గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని విషయాన్ని అతడి సోదరుడికి తెలియజేసి పరారయ్యాడు. మానస కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌ను పట్టుకునేందుకు టీమ్‌లు రంగంలోకి దిగాయని ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. చదవండి: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. -
కేటీఆర్ మనసు దోచుకున్న బుడ్డోడు..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. బల్కంపేట్లో వైకుంఠదామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని థీమ్ పార్క్ నిర్మాణానికి మంత్రి తలసానితో కలిసి భూమి పూజ చేశారు. మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని, మారేడ్‌పల్లిలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అదే విధంగా సనత్ నగర్ నియోజక వర్గాన్ని తలసాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, సనత్ నగర్‌లోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. చదవండి: తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్ ఇదిలా ఉండగా సనత్ నగర్లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్ ఫోన్ పట్టుకొని కేటీఆన్‌ను ఫోటో తీశారు. ఈ ఫోటోను నిన్నటీఆర్ఎస్ ఎమ్మెల్య బాల్కసుమన్ తన ట్విటర్ పోస్టు చేశారు. పిక్ ఆఫ్ ద డే అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. కాగా ఈ ఫోటో నేడు కేటీఆర్ దృష్టిలో పడింది. ఆ బాలుడు ఫొటో తీస్తుండగా మరొకరు తీసిన అతడి ఫొటోను కేటీఆర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి తన పని కానిచ్చాడు’ అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు. This kid stole my heart 💜 Toured Sanath Nagar constituency yesterday & spoke at multiple venues. Not sure where this was from but this young one seems so focused 😀 pic.twitter.com/b3MkwcLLaz — KTR (@KTRTRS) November 14, 2020 -
నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!
-
నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సనత్‌నగర్‌లోని స్నేహపురి కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంట్లో నుంచి బయటికొచ్చిన వెంకటేష్ గుప్తా అనే వ్యక్తి ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. వ్యాపారంలో నష్టాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంకటేష్ సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కలకలం!
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన మహిళను సనత్‌నగర్‌లోని ఎస్ఆర్టీ కాలనీకి చెందిన మంగతాయారుగా గుర్తించారు. ఆమె భర్త భీమేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలోని మొగలిపాలెంకు చెందిన భీమేశ్వరరావు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటున్నారు. కుంటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విజేత సనత్‌నగర్ క్లబ్
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో సనత్‌నగర్ క్లబ్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో గురువారం జరిగిన ఫైనల్లో సనత్‌నగర్ క్లబ్ 91-76తో ఎన్పీఏ జట్టుపై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానంలో ఫైనల్ పోరు ఆసక్తిక రంగా సాగింది. ప్రారంభంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ అర్ధభాగం ముగిసేసరికి 39-37తో సనత్‌నగర్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శివతేజ మరింత దూకుడు పెంచడంతో విజయం సనత్‌నగర్ వశమైంది. సనత్‌నగర్ తరఫున శివతేజ (40), నిఖిల్ (16), నవీద్ (13) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎన్పీఏ జట్టులో రాహుల్ (31), వాసు (16), రవీన్ (11) పోరాడారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించిన రాహుల్, నిఖిల్‌లకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ పురస్కారాలు దక్కాయి.