విజేత సనత్‌నగర్ క్లబ్ | sanat nagar club wins basket ball championship | Sakshi
Sakshi News home page

విజేత సనత్‌నగర్ క్లబ్

Published Fri, Aug 26 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

sanat nagar club wins basket ball championship

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్
 
 సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో సనత్‌నగర్ క్లబ్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో గురువారం జరిగిన ఫైనల్లో సనత్‌నగర్ క్లబ్ 91-76తో ఎన్‌పీఏ జట్టుపై విజయం సాధించింది.  సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానంలో ఫైనల్ పోరు ఆసక్తిక రంగా సాగింది. ప్రారంభంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ అర్ధభాగం ముగిసేసరికి 39-37తో సనత్‌నగర్ ఆధిక్యంలోకి వెళ్లింది.

 

ఆ తర్వాత శివతేజ మరింత దూకుడు పెంచడంతో విజయం సనత్‌నగర్ వశమైంది. సనత్‌నగర్ తరఫున శివతేజ (40), నిఖిల్ (16), నవీద్ (13) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎన్‌పీఏ జట్టులో రాహుల్ (31), వాసు (16), రవీన్ (11) పోరాడారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించిన రాహుల్, నిఖిల్‌లకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ పురస్కారాలు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement