ఏలూరు : సభ్య సమాజం సిగ్గుపడేలా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారిపోతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు .... ఓ విద్యార్థినిని గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగుడెం మండలం నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని .... ఉపాధ్యాయుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి.
నిందితుడికి ఇప్పటికై వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం బయటకు పొక్కటంతో గ్రామంలోని పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థిని గర్భవతి చేసిన ఉపాధ్యాయుడు
Published Tue, Jan 21 2014 9:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement