చంద్రబాబుపై ధ్వజమెత్తిన బాలరాజు
బుట్టాయగూడెం : విపక్ష ఎమ్మెల్యేలను అంగడి వస్తువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు జీవితం మోసాలు, అబద్ధాలతోనే కొనసాగుతోందని విమర్శించారు. మంగళవారం బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, డబ్బు, ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ చంద్రబాబు నీచ రాజకీయలకు పాల్పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజాదారణ పొందలేక సీఎం కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో ఒక మాట, ఆంధ్రలో మరోమాట మాట్లాడుతూ బాబు తన రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు.
అంగడి వస్తువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు
Published Wed, Feb 24 2016 12:49 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement