
వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకట రమణ(పాత చిత్రం)
గుంటూరు జిల్లా : ఎన్నో పోరాటాలు చేసి 2010లో రేపల్లెకి సబ్ కోర్టు సాధించామని..కానీ ఇప్పుడు అది చేజారిపోయే ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చెరుకుపల్లి మండలాన్ని పొన్నూరు పరిధిలోకి మార్చటం అన్యాయమన్నారు. కానీ అక్కడ సబ్ కోర్టు లేకపోవడం వల్ల బాపట్ల వెళ్లాల్సి ఉంటుందని, దాని వల్ల న్యాయవాదులు, కక్షిదారులకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోడిపందేలపై చూపే శ్రద్ధలో కొంచెమైనా దీనిపై చూపాలని ఎద్దేవా చేశారు. రియల్ వ్యాపారులతో ఎమ్మెల్యే అనగాని కుమ్మక్కయ్యారని..అందుకే వారికి అవసరమైన చోట బ్రిడ్జీలు కట్టించే పనిలో ఎమ్మెల్యే ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులు ఎమ్మెల్యేకు పట్టడంలేదని తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment