repalle
-
మనం చేసిన మేలు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది
ఇవాళ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. విద్య, వైద్య రంగాలను నాలుగు నెలల్లోనే నాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పేదవాడు వెళితే వైద్యం చేస్తారన్న నమ్మకం లేని పరిస్థితి. దాదాపు రూ.2,400 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. చదువుకునే పిల్లలు విద్యాదీవెన, వసతి దీవెన కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసినా పెట్టుబడి సహాయం లేదు. ఆర్బీకేలు లేవు. ధాన్యం కొనుగోలులో మళ్లీ దళారులు వచ్చారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. ఏ పథకమూ డోర్ డెలివరీ లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు వెళ్తేనే వాళ్ల సమక్షంలో పథకాలు ఇచ్చే పరిస్ధితి. అక్కడకు వెళ్లకపోతే పథకాలు నిలిచిపోతాయి. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారు.మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. ప్రతి ఇంట్లో బతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామంలో ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి. పిల్లలు రూ.15 వేల గురించి అడుగుతారు. మహిళలు రూ.18 వేల గురించి అడుగుతారు. పెద్ద వాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు. రైతులు రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఏమని సమాధానం చెబుతారు? ఇప్పుడు రెడ్‌బుక్ పాలన సాగుతోంది. ప్రజలను భయపెడుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది. అన్ని వ్యవస్ధలు కూలిపోయాయి. అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం పది పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెంచే కార్యక్రమం నడుస్తోంది. డిస్టిలరీస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. లిక్కర్ సిండికేట్స్ అప్పుడే మొదలయ్యాయి. గ్రామ గ్రామాన బెల్టు షాపులు ప్రమోట్ చేసే కార్యక్రమం నడుస్తోంది. ఇసుక గురించి మాట్లాడలేని పరిస్థితి. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇవాళ ఉచితం లేదు కానీ, రెట్టింపుకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : ‘ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పారు. ప్రజలను మోసం చేశారు. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఇంటికీ మంచి చేసిన మనకే ఇలా అయితే.. ప్రజలను ఇంతలా మోసం చేసి, అన్నీ అబద్ధాలే చెప్పిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు? ఆయన ప్రజలను ఎన్ని రోజులు భయపెడతారు? ఎన్ని రోజులు కేసులు పెడతారు? ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే చంద్రబాబుకు పరాజయం తప్పదు.టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరు. ఇది నిజం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ ఉందన్నారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఎత్తిచూపుతూ.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని.. ఇది సృష్టి ధర్మమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఉద్బోధించారు. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష అని.. మన వ్యక్తిత్వమే మనల్నిముందుకు నడిపిస్తుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రేపల్లె నియోజకవర్గంలోని స్థానిక సంస్థలప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఐదేళ్లు గర్వంగా తలెత్తుకునేలా పాలన » 2019 నుంచి 2024 వరకు మనం గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం. ‘నేను వైఎస్సార్సీపీ కార్యకర్తను’ అని ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటికి వెళ్లి గర్వంగా చెప్పుకునేలా మన పాలన సాగింది. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగింది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి తొలిసారిగా మన పార్టీ మాత్రమే చెప్పింది. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పబోమని వాటిని నెరవేరుస్తూ అడుగులు వేశాం. » మొట్టమొదటి బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా పథకాలన్నీ అమలు చేశాం. మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరింది. మనకు ఓటు వేశారా.. లేదా అన్నది చూడలేదు. కులం, మతం కూడా చూడకుండా పథకాలు డోర్ డెలివరీ చేసి అండగా నిలబడ్డ ప్రభుత్వం మనది. » కోవిడ్ వంటి సంక్షోభం సమయంలో ఆదాయం తగ్గి.. ఖర్చు పెరిగినప్పటికీ ఏ పథకాన్నీ ఆపలేదు. ఎలాంటి సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. పైగా, అంతకు ముందు చంద్రబాబు చేసిన అప్పుల భారం కూడా మన మీద పడింది. దాదాపు రూ.20 వేల కోట్ల కరెంటు బిల్లులు వదిలిపెట్టి వెళ్లారు. అయినా తొలిసారిగా డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా ప్రజలకు మేలు చేయొచ్చని రుజువు చేశాం. అది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. గణేష్ మీ మనిషి» మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఏరోజైనా మంచే చేశాం. తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేశాం. అంతటితో మర్చిపోకుండా మంత్రి పదవి ఇచ్చి కేబినెట్లో పెట్టుకున్నాను. మండలిని రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవి పోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపాం. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీది. మనం ఆయనకు ఎక్కడా తక్కువ చేయలేదు. » ఇప్పుడు గణేష్ కు మీ మద్దతు చాలా అవసరం. మంచి వాడు. కార్యకర్తకు ఏంజరిగినా నా దృష్టికి తీసుకొస్తాడు. గణేష్ లో ఆ మంచి గుణం ఉంది. ఆయన మీలో ఒకడు. మీ నుంచి వచ్చిన వాడు. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యం. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు. నన్నే ఉదాహరణగా తీసుకోండి. మా నాన్న ముఖ్యమంత్రి. అయినా కష్టాలు వచ్చాయి. పెద్ద వాళ్లంతా ఏకమయ్యారు. తప్పుడు కేసులు పెట్టారు. ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టారు. వేధించారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించ లేదా? మంచి చేసే మనసు ఉన్నప్పుడు, ఆ మంచి వైపు దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి.కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు » విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. స్కూళ్లలో ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో స్కూళ్ల మార్పులు, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ క్లాసులు, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు వచ్చింది కూడా మన ప్రభుత్వమే. » మనం అధికారంలోకి రాక ముందు కేవలం వెయ్యి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు పెంచాం. ఏకంగా పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధి పెంచాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం. జీఎంపీ ప్రమాణాలున్న మందులు ఇచ్చాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఊళ్లలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అక్కడే 105 రకాల మందులు, 14 రకాల టెస్టులు చేసే విధంగా ఆరోగ్య సురక్ష అందుబాటులోకి తెచ్చాం. » వ్యవసాయ రంగంలో ఉచిత పంటల బీమా కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అమలైంది. రైతులకు పెట్టుబడి భరోసా పక్కాగా అమలు చేసింది మన ప్రభుత్వం మాత్రమే. మొదటిసారిగా ఈ–క్రాపింగ్, ఆర్బీకేలు, రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాం. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. వాళ్లు తలెత్తుకుని తిరగలేని పరిస్థితివాళ్లు అబద్ధాలు చెప్పి మోసంతోనే ప్రచారం చేశారు. వలంటీర్లను తీసేయబోమని, వారికి రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నా.. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వారి తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు అని, 50 ఏళ్లకు పైబడిన మహిళ కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, కండువాతో రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి అబద్ధాలతో మోసం చేశారు. ఒకవేళ నేను కూడా అలాంటి అబద్ధాలు చెప్పి ఉంటే, ఈరోజు సీఎం స్ధానంలో ఉండేవాడిని. కానీ, మీలో ఎవరైనా ఇవాళ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేదా? -
ఇప్పుడే తేలిన లంక గ్రామాలు పరిస్థితి దయనీయం
-
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
-
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
-
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
-
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
-
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
-
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
థాంక్యూ జగన్ మామయ్య..
-
YSRCP జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు
-
Repalle: టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్‌ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి అన్నారు. ఈవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలంతా గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది. కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్‌ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్‌లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని పేకాట ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్‌ను గెలిపించుకోవాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సీఎం జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారు. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబులాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు, మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. వైఎస్సార్సీపీ అలా చేయదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం.సీఎం జగన్‌ని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీకి చేదు అనుభవం.. షాక్ ఇచ్చిన స్థానికులు
బాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరిట టీడీపీ కార్యక్రమం చేస్తుండగా, తమ వీధికి రావొద్దంటూ టీడీపీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు స్థానికులతో గొడవకు దిగారు. టీడీపీలో టికెట్ల పంచాయతీ పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్‌ను కొమ్మలపాటి శ్రీధర్ కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కొమ్మలపాటికి టికెట్ కేటాయించాలంటూ తీర్మానించారు. వేరే వారికి టికెట్ కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ చంద్రబాబు, లోకేష్‌లకు టీడీపీ నేతలు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదీ చదవండి: Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు! -
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీలో ఆధిపత్య పోరు
-
అమెరికాలో ఎయిర్పోర్ట్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం
న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్‌పోర్ట్‌కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు. విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్మౌత్ ట్రాన్‌పోర్టేషన్ బస్సు విశ్వచంద్‌ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్ది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్‌మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు. -
మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: మోపిదేవి వెంకటరమణ
-
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
సత్వరమే స్పందించినా రాజకీయమా?
ఒంగోలు అర్బన్/ఒంగోలు/రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నా టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబులతో కలసి వనిత పరామర్శించారు. రూ.4.12 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వ్యక్తిగతంగా కొంత మొత్తాన్ని అందించారు. అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలి భర్త అర్ధరాత్రి స్థానిక పోలీసులను సంప్రదిస్తే.. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారని, తెల్లవారేసరికల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసుతోపాటు లైంగికదాడి, హత్యాయత్నం, దొంగతనం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ద్వారా బాధితులకు రూ.2 లక్షల పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మహిళా, శిశు సంక్షేమం కింద మరో రూ.50 వేలు అందజేస్తున్నామన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నా ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాధితులకు సాయమందించేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ మలికాగర్గ్ తదితరులు పాల్గొన్నారు. హోం మంత్రి తానేటి వనిత కారును అడ్డుకుంటున్న టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి కాన్వాయ్‌పై దాడి కాగా హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్‌హౌస్ నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలసి బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలుదేరిన మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. వనిత కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ప్రజాప్రతినిధులను దూషించారు. ఈ ఘటన ఒంగోలు రాంనగర్ ఒకటో లైను వద్ద చోటు చేసుకుంది. దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొమ్మూరి సుధాకర్ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ట్రాన్స్‌జెండర్ గోను దుర్గ, శేషమ్మ, రావిపాటి సీత, ఆళ్ల వెంకటరత్నం తదితరులు దాడికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార ఘటనలో నిందితులకు 15 రోజులు రిమాండ్ కాగా అత్యాచారానికి పాల్పడిన ఇరువురు నిందితులను రేపల్లె అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో బాల నేరస్తుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
AP: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. -
వలస కూలీపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై నిద్రించారు. సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్‌ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్‌ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు. బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్‌ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్‌లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్‌కు తరలించామన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని మహిళా కమిషన్ సీరియస్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు. -
కణకణమండే అగ్ని కీలలు.. కొడ‘వళ్లు వంచి శ్రమించే’ శ్రామికులు
ఈ చిత్రంలోని ఇతని పేరు పుసులూరి బుజ్జిబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు. వ్యవసాయ సీజన్లో రోజుకు వంద నుంచి 150 కొడవళ్లు తయారు చేసి సాన పట్టి, కుక్కు పెడతారు. సుమారు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తారు. ఈ సీజన్లో నిత్యం పని ఉంటుందని, కుటుంబాలు సక్రమంగా సాగిపోతాయని బుజ్జిబాబు ఆనందంగా చెబుతున్నారు. మామూలు రోజుల్లో నామమాత్రంగా పని ఉంటుందని పేర్కొన్నారు. కణకణమండే అగ్ని కీలలు.. అందులో నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. లయబద్ధమైన సుత్తుల సవ్వడులు.. బలంగా బిగిసే పిడికిళ్లు.. కొడ‘వళ్లు వంచి’.. సానబట్టే చేయి తిరిగిన శ్రామికులు.. పేటేరు గ్రామంలో నిత్యం కనిపించే దృశ్యాలివీ.. కొడవళ్ల తయారీకి ఈ గ్రామం పెట్టింది పేరు. రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే రేపల్లె మండలం పేటేరు గ్రామం వైపు రైతులు, వ్యాపారుల అడుగులు పడతాయి. వ్యవసాయ పనులకు అవసరమైన కొడవళ్ల తయారీకి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకే కాక ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి కొడవళ్లు ఎగుమతి అవుతాయి. ఈ గ్రామంలో సుమారు 70 ఏళ్ల క్రితం కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. మూడు తరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఇక్కడి శ్రామికులు జీవనం సాగిస్తున్నారు. కొడవలి తయారీలో అద్భుత నైపుణ్యం సాధించారు. వీరు జీవించే కాలనీ శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 40కుపైగా కార్ఖానా(కొలిమి)లు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 200 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. తయారీ ఎలాగంటే.. ముడి ఇనుపబద్ధలను కొలిమిలో కాల్చి కార్మికులు కొడవలిని తయారు చేస్తారు. అనంతరం దానికి సానబెట్టి నొక్కులు కొట్టి పట్టుకునేందుకు అనువుగా చివరన చెక్కలను అమరుస్తారు. సీజన్లో ఒక్కొక్క కొలిమిలో రోజుకు సుమారుగా 500 వరకు కొడవళ్లు తయారు చేస్తుంటారు. ఇవి మూడు సైజుల్లో ఉంటాయి. సైజును బట్టి ధర ఉంటుంది. చిన్నసైజు రూ.30, మధ్యస్తంగా ఉన్నవి రూ.60, పెద్దవి రూ.90 వరకు విక్రయిస్తారు. ప్రతి నెలా గ్రామంలో లక్షకుపైగా కొడవళ్లు తయారవుతాయని అంచనా. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చినా కొడవళ్లకు గిరాకీ తగ్గలేదు. ముడిసరుకు దిగుమతి బేల్ కట్లకు ఉపయోగించి పనికిరాని పడవేసే ఇనుప బద్దలను చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచే కాకుండా విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.30లెక్కన కొని ఇక్కడి కార్ఖానాల యజమానులు దిగుమతి చేసుకుంటారు. బొగ్గులు, చెక్క సిద్ధం చేసుకుని కొడవళ్లు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని, దీనికి రవాణా చార్జీలు అదనంగా పడుతున్నాయని యజమానులు చెబుతున్నారు. వందల మంది కార్మికులు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తుంటారు. కత్తులు తయారీలో నాణ్యమైన ముడి ఇసుమును ఉపయోగించటం వల్ల ఎక్కువ కాలం మన్నుతాయి. అందుకే ఇక్కడ తయారైన కొడవళ్లకు మంచి గిరాకీ ఉంది. – చందోలు రవికుమార్, శ్రామికనగర్, పేటేరు కొడవళ్లు అమ్ముతా వ్యవసాయ సీజన్లో పేటేరు నుంచి కొడవళ్లు తీసుకువెళ్లి మా జిల్లాలో అమ్మకాలు చేస్తుంటాం. పేటేరు కొడవళ్లు మన్నికగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా తీసుకువెళ్తున్నాం. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పేటేరు రావాల్సిందే. – సత్యనారాయణ, వ్యాపారి తుని, తూర్పుగోదావరి -
మహానటి సావిత్రి.. చదువులమ్మ..
ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం... అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం గ్రామంలో పాఠశాల ఏర్పాటు కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం. వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా... పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి. తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు. ‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. -
వెళితే మడమ తిప్పలేం
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతిసిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ.. సాగరుడితో జతకట్టేందుకు వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ.. చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలుపోతున్నట్టు వినసొంపైన పక్షుల కిలాకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలాహిరిలో అంటూ కడలి తీరానికి సాగే పడవ ప్రయాణం.. సముద్ర జలాల మధ్యలో చూసితీరాల్సిన అందాల దీవి.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్టు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు స్వాదించాలంటే నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. మరి ఓసారి చూసొద్దాం రండి.. రేపల్లె: తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్తీక మాసాన యాత్రికులను రారమ్మంటూ పిలుస్తున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని గుంటూరు–కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో సుమారు 4వేల హెక్టార్లలో దట్టంగా అలుముకున్నాయి. ఆహ్లాదం.. పడవ ప్రయాణం నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో పాతూరు డ్రెయిన్ ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్ల మేర మలుపులు తిరుగుతూ ప్రయాణించి సముద్రంలో కలుస్తోంది. ఈ డ్రెయిన్ ఇరువైపులా దట్టంగా విస్తరించిన మడ అడవులు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డ్రెయిన్‌లో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. సాగర తీరానికి ఈ మార్గంతో పాటు నక్షత్రనగర్ నుంచి బీఎం డ్రెయిన్ మీదుగా మరో మార్గమూ ఉంది. అయితే ఆ మార్గం మడ అడవులు తక్కువగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్లేందుకు పాతూరు లేదా నక్షత్రనగర్‌లో మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. బోటు మొత్తం బుక్ చేసుకుంటే సుమారు రూ.7వేలు తీసుకుంటారు. కార్తీక ‘ద్వీపం’ మడ అడవుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం అనంతరం సముద్ర తీరానికి కొంచెం దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన అందాల ద్వీపం ఉంటుంది. ఇది ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సముద్రంలో కొంత దూరం పడవలో ప్రయాణించాలి. ఈ ఐలాండ్ సాగర స్నానాలకు అనువుగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడపొచ్చు. సముద్ర తీరం వంపులో ఉండటంతో ఐలాండ్‌తోపాటు, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశావారిపాలెం గ్రామంలోని సముద్రంలో ఎడమ వైపు సూర్యోదయం, కుడి వైపు సూర్యాస్తమయం కనిపిస్తాయి. కన్యాకుమారి తరహాలో సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను తిలకించే అవకాశం ఇక్కడ ఉండడం విశేషం. ఐలాండ్‌లో వసతుల లేమి బోట్లు అంబాటులో లేకపోవడం వల్ల ఐలాండ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. సరైన వసతులు లేకపోవడం కూడా యాత్రికులు రాకపోవడానికి మరో కారణం. గతంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా మడ అడవుల నడుమ ప్రయాణించి ఐలాండ్‌లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. ఐలాండ్ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు కల్పించి అందుబాటులో బోట్లు ఉంచితే ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఫలితంగా తీరప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. , -
రేపల్లె టౌన్ లో భారీ బైక్ ర్యాలీ