రేబిస్ తో యువకుడు మృతి | Teen dies of rabies | Sakshi
Sakshi News home page

రేబిస్ తో యువకుడు మృతి

Published Mon, Sep 7 2015 7:36 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

Teen dies of rabies

రేపల్లె (గుంటూరు) : కుక్క కరిచినా వైద్యం చేయించడంలో నిర్లక్ష్యం వహించడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని 17వ వార్డులో మూడు రోజుల క్రితం ఆనంద్(17) అనే యువకుడిని ఓ పిచ్చి కుక్క కరిచింది. స్వల్ప గాయాలు కావడంతో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోకుండా కేవలం ప్రాథమిక వైద్యం చేయించారు.

అయితే సోమవారం ఆనంద్ పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్కు రేబిస్ సోకిందని, బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆనంద్‌ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకురాగా, సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement