Rabies
-
భౌబోయ్.. కరిచేస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: శునకాలు చెలరేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం 8,300 మందికి పైగా ప్రజలు కుక్క కాట్ల బారినపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023లో దేశంలో 30,43,339 కుక్కు కాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 286 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో వీధి కుక్కల కాట్లు, రేబిస్ నివారణకు జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం.. 2023లో కుక్కు కాటు కేసుల కోసం 46,54,398 యాంటీ రేబిస్ షాట్లను చికిత్సగా అందించినట్టు తెలిపింది. అత్యవసర మందుల జాబితాలో వ్యాక్సిన్, సీరమ్అత్యవసర, ముఖ్యమైన మందుల జాబితాలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్, యాంటీ రేబిస్ సీరమ్‌ను చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కుక్క కాటు కేసులను నియంత్రించేందుకు కుక్కల జనాభా నిర్వహణ కీలకమైన విధుల్లో ఒకటని పేర్కొంది. దీని కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం నిధుల మంజూరు చేయడంతోపాటు రేబిస్ టీకాల కోసం సాయం అందిస్తున్నట్టు తెలిపింది.2030 నాటికి రేబిస్ నిర్మూలన దిశగా.. కుక్క కాట్ల నివారణ, రేబిస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2030 నాటికి రేబిస్ నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. దశల వారీగా రేబిస్ రహిత నగరాల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో రేబిస్ నివారణ కోసం టైర్–1, టైర్–2 నగరాలను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్ఛేరి, అస్సాం రాష్ట్రాల్లో రేబిస్ హెల్ప్‌లైన్ 15400 ప్రారంభించినట్టు, ఇతర రాష్ట్రాల్లో దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో మానవ శక్తిని పెంచడం, రేబిస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రాఫిలాక్సిస్ కోసం వ్యయంతో కూడిన ఇంట్రాడెర్మల్ రేబిస్ వ్యాక్సిన్లను ప్రచారం చేయడం, రేబిస్ డయాగ్నస్టిక్స్ బలోపేతం చేయడం, జంతువుల కాటు రాబిస్ కేసులపై నిఘాను బలోపేతం చేయడం, అవగాహన కలి్పంచడం, కార్యాచరణ పరిశోధన వంటి చర్యలను చేపట్టినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబిస్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రేబిస్ వ్యాక్సిన్లు, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ సేకరణ, రేబిస్ నివారణకు అవగాహన కల్పన కోసం బడ్జెట్ ద్వారా నేషనల్ రేబిస్ కంట్రోల్ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రాలు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. -
సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు
కేప్ టౌన్: సముద్రపు క్షీరదం సీల్‌కు రేబిస్ సోకడాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సీల్స్ ఎక్కువగా అంటార్కిటిక్ జలాల్లో కనిపిస్తాయి. ఇవి చల్లని ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రభుత్వ పశువైద్యుడు డాక్టర్ లెస్లీ వాన్ హెల్డెన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పశ్చిమ, దక్షిణ తీరాలలోని వివిధ ప్రదేశాలలో 24 కేప్ సీల్స్ రేబిస్‌తో బాధపడుతూ మృతిచెందాయని తెలిపారు.క్షీరదాలను రేబిస్ అమితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి వైరస్ మనుషులకు సోకుతుంది. రేబిస్ సోకితే అది ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ అనేది లాలాజలం ద్వారా లేదా జంతువులు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను రకూన్లు, కొయెట్లు, నక్కలు, పెంపుడు కుక్కలలో చాలా కాలం క్రితమే కనున్నారు. అయితే సముద్రపు క్షీరదాలలో రేబిస్ వైరస్ కేసు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.1980ల ప్రారంభంలో నార్వేలోని స్వాల్బార్డ్ దీవుల్లోని సముద్రపు క్షీరదాల్లో రేబిస్‌కు సంబంధించిన ఒక కేసును గుర్తించారు. అయితే సీల్స్‌లో రేబిస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు తొలిసారిగా కేప్ టౌన్ బీచ్‌లో ఒక కుక్కను సీల్ కరిచినప్పుడు ఆ సీల్లో రేబిస్‌ను గుర్తించారు. ఆ కుక్కకు రేబిస్ సోకింది. అనంతరం పరిశోధకులు 135 సీల్ మృతదేహాల మెదడు నమూనాలలో రేబిస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో 20 కొత్త నమూనాలను కూడా సేకరించారు. తదుపరి పరీక్షలో మరిన్ని రేబిస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు సీల్స్కు రేబిస్ ఎలా సోకుతుంది? వాటిలో వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందా? దీనిని అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాండాలకు బదులు.. -
కిల్లర్ డాగ్స్!
..: ఇది జర్నలిజంలో ఓ పాత పాఠం :..జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నాయి. అందుకే మనిషిని కుక్క కరవడం కాదు.. చంపేస్తున్నా.. పెద్దగా పట్టనట్లే ఉంటున్నాయి.ఫలితం..ఓ విహాన్.. ఓ పూలమ్మ,.. ఓ రామలక్ష్మి.. పేరేదైతేనేం.. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తరచూ పదుల సంఖ్యలో ప్రజలు కుక్కకాట్ల బారిన పడుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉన్న సమస్య ఇది.. ఎవరూ సీరియస్‌గా తీసుకోని విషయమిది. మరేం చేద్దాం?ఇప్పటికైనా పట్టించుకుందామా? పట్టనట్లే ఉందామా?⇒ హైదరాబాద్‌లోని మియాపూర్ మక్తాకు చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌పై రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. నెల రోజుల క్రితం ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. గత పదిహేను రోజుల్లో నాలుగు కుక్కకాటు ఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడ్డారు. ⇒ రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో 20 రోజుల కింద పిట్ల రామలక్ష్మి (80) అనే వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి.⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, వెంకటలక్ష్మి దంపతులు హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని ఆదర్శనగర్‌కు మూడు నెలల క్రితం వలస వచ్చారు. వారి 18 నెలల కుమారుడు విహాన్‌ను ఇటీవల కుక్కలు దాడి చేసి చంపేశాయి.⇒ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్లకు చెందిన జంగం నర్సయ్య బర్ల కాపరిగా, ఆయన భార్య పూలమ్మ (50) గ్రామ పంచాయతీ నర్సరీలో కూలీ పని చేసేవారు. వారి ఏకైక కుమార్తె వివాహం కావడంతో.. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. జూలై 5న పూలమ్మ నర్సరీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. దీనితో తాను ఒంటరిని అయిపోయానంటూ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు... ఈ ఘటనలే కాదు.. చెప్పుకుంటూపోతే మరెన్నో.. వీధి వీధినా, గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎన్నో వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న కుక్కల దాడి ఘటనలెన్నో. అవి మనుషులకు మంచి స్నేహితులంటూ మనం చెప్పుకొనే శునకాలే.. ఇంటి ముందో, వీధిలోనో కలియదిరుగుతూ కనిపించేవే. కానీ కొన్నేళ్లుగా కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వయసు మళ్లినవారిపై దాడిచేసి పొట్టనపెట్టుకుంటూ కన్నీళ్లు నింపుతున్నాయి. - సాక్షి, హైదరాబాద్ఆహార కొరత.. విపరీతంగా సంతానోత్పత్తివీధికుక్కలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆహార కొరత అని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. కుక్కలు పెద్ద శబ్దాలు, ఎక్కువ వెలుగు ఉండే లైట్ల వల్ల ఆవేశపడతాయని.. ఇలాంటి సమయాల్లోనే అవి అతిగా దాడులు చేస్తుంటాయని వివరిస్తున్నారు. సాధారణంగా కుక్కలు మాంసాహారాన్ని ఇష్టపడతాయి. కానీ ఇప్పుడు వాటికి శాఖాహారం కూడా దొరకని పరిస్థితి రావడంతో రెచ్చిపోతున్నాయి.అందువల్ల కుక్కలకు షెల్డర్ హోమ్‌లు, ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయని కార్పొరేషన్ వెటర్నరీ విభాగం చెబుతోంది. కానీ వాస్తవంగా 10 లక్షలకుపైగానే వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడో వంతు కుక్కలకు కూడా స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగలేదని సమాచారం.నామ్ కే వాస్తేగా కార్యాచరణకుక్కకాట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇటీవల హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ హడావుడి నాలుగైదు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పశు జనన నియంత్రణ కేంద్రాలు ఉండగా.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు.2030 నాటికి రేబిస్ నిర్మూలన సాధ్యమెట్లా?దేశంలో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే శునకాల నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కానీ కేంద్రం సరిగా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్రాలూ పట్టించుకోవడం లేదు. కుక్కకాట్లతో రేబిస్ సోకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది చనిపోతుంటే.. అందులో 20 వేలకుపైగా (36 శాతం) మరణాలు మనదేశంలోనే నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఒక్క జంట నుంచి ఏడేళ్లలో 4 వేల కుక్కలు⇒ కుక్కల జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు⇒ 8 నెలల వయసు నుంచే వాటికి సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది⇒ వీటి గర్భధారణ సమయం 60–62 రోజులే ఏటా రెండు సార్లు పిల్లలను కంటాయి. ప్రతిసారి 4 నుంచి 8 పిల్లలను పెడతాయి⇒ ఒక శునకాల జంట, వాటి పిల్లలు, వీటన్నింటికీ పుట్టే పిల్లలు ఇలా.. ఏడాదిలోనే 40 వరకు అవుతాయి. మొత్తంగా ఒక్క జంట నుంచి ఏడేళ్లలో సుమారు 4 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుందికాకి లెక్కలేనా..?జీహెచ్ఎంసీలో ఏటా 50, 60 వేల వీధికుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) జరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.12 కోట్లకుపైగానే వ్యయం చేస్తున్నారు. కానీ వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతోంది. నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు ఒక్కో కుక్క స్టెరిలైజేషన్ కోసం రూ.1,700 చొప్పున ఖర్చు చేస్తున్నా.. చేసే ఆపరేషన్లకు, చూపే లెక్కలకు తేడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.గోవా ఎలా కంట్రోల్ చేయగలిగింది?కుక్కకాట్ల విషయంలో గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క కుక్కకాటు మరణం కూడా నమోదు కాలేదు. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను విద్యార్థులకు, మహిళలకు తెలియజెప్పడం వంటి అంశాలు గోవాలో సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందాయి.ఆ రాష్ట్రాల్లో బాధితులకు పరిహారంకుక్కకాటు ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని గత సంవత్సరం హరియాణా– పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10వేల రూపాయల చొప్పున బాధి తులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్లు, ఆపైన కోత పడితే బాధితులకు రూ.20 వేలు చెల్లించా లని.. ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిహారం లేదు.పిల్లలు పలవుతున్నా ప్రభుత్వం స్పందించల్లేదుమాది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్. ఇటీవల రెండు పిచ్చి కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. నా బిడ్డ ప్రావీణ్య కూడా తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో పిల్లలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సాగర్‌రెడ్డి, ప్రావీణ్య తండ్రికొత్త ప్రదేశాల్లో వదిలేయడంతో సమస్యలువీధికుక్కల స్టెరిలైజేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు పొరపాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ కోసం తీసుకువెళ్లిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకుండా కొత్త ప్రదేశాల్లో విడిచిపెడుతున్నారు. అక్కడి కుక్కలు కొత్తవాటిని రానీయకపోవడం, మనుషులూ కొత్తవారు కావడంతో అభద్రతకు లోనవుతాయి. దీనికితోడు కుక్కలు అతి చల్లదనం, వర్షాలు, వేడిని తట్టుకోలేవు. చిత్రంగా ప్రవర్తిస్తూ దారినపోయే వారిపై దాడులకు దిగుతాయి. కుక్కలకు సకాలంలో స్టెరిలైజేషన్ చేయాలి. షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలి. – అసోసియేట్ ప్రొఫెసర్ రాంసింగ్ లఖావత్, వెటర్నరీ యూనివర్సిటీరేబిస్ సోకే ప్రమాదం.. జాగ్రత్త.కుక్కకాటుతో రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది. కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని పది, పదిహేను నిమిషాల పాటు నీటితో శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రేబిస్ సోకితే తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు వస్తాయి. తర్వాత పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించèలేక పోవడం, నోట్లోంచి నురగ, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపి స్తాయి. చివరిగా కోమాలోకి వెళ్లి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ, రంగారెడ్డిరెచి్చపోయిన పిచ్చి కుక్కలు29 మందికి గాయాలు బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు నందిపేట్ /మాచారెడ్డి/ మంగపేట: నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లా మంగపేటలో సోమవా రం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి సుమారు 29 మందిని గాయపర్చాయి. బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్‌రెడ్డి వెల్డింగ్ షాప్ నుంచి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట్రాజ్ టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల వరకు ఓ పిచి్చకుక్క పదిమందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లిటిల్ ఫ్లవర్ స్కూలు విద్యారి్థ, ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మ లసుంబాయిపై కూడా కుక్క దాడి చేసి తొడ, చేతి కండరాలను పీకేసింది.మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ (ఎం)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిచ్చి కుక్క పది మందిని గాయ పర్చింది. అక్షిత అనే బాలికపై, ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడు పోచయ్యతో పాటు యాకూబ్, చైతన్య, హార్యన్, రంజిత్ తదితరులపై కుక్క దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్తులు కుక్కను చంపేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేటలోనూ ఓ పిచ్చి కుక్క పలువురిపై దాడిచేసింది. గంపోనిగూడెం, పొదుమూరు, మంగపేటలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, రోడ్డుపై నున్న ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, ఎండి సైదా, మైతున్బి, ఎండి గోరెతోపాటు మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. -
భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
విశాఖపట్నం: భీమిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెట్ డాగ్ కరిచింది..భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యారు..రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు..అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే. తండ్రి కొడుకు మరణించారు -
కుక్క కరిచిన విషయాన్ని దాచి, నెలరోజల్లోనే విలవిల్లాడుతూ..
ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పకపోవడంతో.. నెలన్నర తర్వాత ప్రాణాంతక రేబిస్‌తో (కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి) చనిపోయాడు. తండ్రి భూజాల మీదే చిన్నారి కన్నుమూయడం హృదయ విదారకం. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న షావేజ్‌గా గుర్తించారు. వివరాలు.. విజయ్ నగర్ పీఎస్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావేజ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెలన్నర కిత్రం అతన్ని పక్కింటి వారికి చెందిన కుక్క కరిచింది. ఈ విషయాన్ని చిన్నారి భయంతో తన తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా దాడిపెట్టాడు. అయితే ఆ కుక్కకు వ్యాక్సిన్ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్ వ్యాధి వ్యాపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. అన్నం తినడం మానేసి వింతగా ప్రవర్తించడం, కుక్కలా మొరగడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో కొన్ని రోజుల క్రితం కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు. షావేజ్ కుటుంబీకులు అతన్ని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స చేసేందుకు చేర్చుకోకపోవడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి క్షీణించడంతో బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు బయల్దేరారు. If you can't vaccinate 🐕, then don't domestic one. Yesterday evening a 14-yr-old Shavez, died in his father's arm, as he did not inform his parents about dog bite, which he suffered more than a month ago due to negligence of his neighbour. #Ghaziabad #UttarPradesh pic.twitter.com/45wVyPw5nC — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 5, 2023 అంబులెన్స్‌లో ఘజియాబాద్‌కు తీసుకువస్తున్న సమయంలో బాలుడు తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నొప్పితో మెలికలు తిరుగుతున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు బాలుడి మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. STORY | Ghaziabad boy dies of rabies over a month after dog bite, hid incident from parents out of fear READ: https://t.co/Ialssrekma VIDEO: pic.twitter.com/4VGnf1t4Y2 — Press Trust of India (@PTI_News) September 6, 2023 -
రెండు సెకన్లకో దాడి.. అరగంటకో మరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. 100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య. 70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ 2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు. ఏటా సుమారు 20 వేల మంది మృతి ♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్‌తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కోటిన్నర వీధికుక్కలు... ♦ భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట... దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. 3 రకాల శునకాలు.. ♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి. కుక్కల నియంత్రణ ఇలా... ♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు. ♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ, ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి. -
కుక్క కాటుకు వ్యాక్సిన్ కొరత..
సాక్షి, హైదరాబాద్: కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధితో సంభవిస్తున్న మరణాలు తెలంగాణలో గణనీయంగా ఉన్నాయి. ఇటువంటి మరణాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య 21 మంది రేబిస్ వ్యాధితో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 32 మంది ఈ కాలంలో మరణించగా, తర్వాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో 24 చొప్పున, తమిళనాడులో 22, కేరళ, తెలంగాణల్లో 21 చొప్పున రేబిస్ మరణాల కేసులు నమోదయ్యాయి. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం దేశం మొత్తం అమలవుతున్నా రేబిస్ మరణాలు సంభవించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ కొరత... : రాష్ట్రంలో అనేక ఆస్పత్రుల్లో కుక్క కరిచిన తర్వాత జరగాల్సిన చికిత్సకు అవసరమైన మందులు లేవనే చెప్పాలి. అధికార లెక్కల ప్రకారమే కుక్కకాటు వల్ల దాదాపు 40 వేల మందికిపైగా ఆస్పత్రులపాలవుతున్నట్లు వెల్లడైంది. ఇక విచక్షణారహితంగా కరిచే పిచ్చికుక్కలను పట్టి దూరంగా వదిలివచ్చే శిక్షణ కలిగిన సిబ్బంది కొరత కూడా తీవ్రంగానే ఉంది. మున్సిపల్ అధికారులు ఏదో నామమాత్రంగా పిచ్చికుక్కలు, వీధికుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా ఆచరణకు వచ్చే సరికి కాగితాలకే మిగిలిపోతున్నాయి. రేబిస్ నిరోధక టీకాలు కొనుగోలు, సరఫరా అంతా ఒక మిథ్యగా మారిపోతోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి కొంటున్నట్లు చెప్తున్నా మందులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాగే కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రణ చేసే కార్యక్రమం కూడా నామమాత్రంగా మారింది. శునకాలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా అవి ఎంతవరకు వాస్తవం అనేది అగమ్యగోచరంగానే ఉంది. వీధి కుక్కలకు వచ్చిన జబ్బులకు చికిత్సచేసే విధానం అయితే లేదనే చెప్పొచ్చు. -
పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి
సాక్షి, హైదరాబాద్/అల్వాల్: ఓల్డ్ అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు. కుక్కల బెడద తప్పేదెప్పుడు..? కుక్కల సంతాన నియంత్రణకు, ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు ఏటా దాదాపు రూ.10 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ, నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదు. తాజాగా అల్వాల్ సర్కిల్ పరిధిలో కుక్కలు 20 మందిని కరవడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండేళ్ల క్రితం సైతం అమీర్‌పేటలో ఓ కుక్క దాదాపు 50 మందిని కరవడం తెలిసిందే. అప్పట్లో ఆ కుక్కకు రేబిస్ వ్యాధి ఉన్నట్లు బెంగళూర్‌లోని పరిశోధన సంస్థ వెల్లడించింది. తాజా ఘటనలోనూ పరీక్ష ఫలితాలు వెలువడితే కానీ దానికి రేబిస్ ఉందో, లేదో తెలియదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఏడాది క్రితం కొన్ని వార్డులను ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించిన అధికారులు దాని ఫలితాలేమిటో వెల్లడించలేదు. వీధి కుక్కలను పట్టుకురావడం.. సంరక్షణ బాధ్యతల్ని సైతం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయినా నగరంలో కుక్కల బెడద తప్పడం లేదు. ఏటా ఎన్నో ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ నగరంలో పది లక్షలపైనే వీధి కుక్కలున్నట్లు అంచనా. ప్రతినెలా నగరంలో 2వేల నుంచి 4వేల మంది వరకు కుక్కకాట్ల బారిన పడుతున్నారు. (చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది) -
ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి: లక్షణాలు ఇవే, జాగ్రత్తలు అవసరం!
సాక్షి,అనంతపురం: కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పశుసంవర్ధక శాఖ ఇన్చార్జ్ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం, రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్రం ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్ సూచించారు. ప్రముఖ జీవ శాస్త్రవేత్త, రేబీస్ టీకా సృష్టికర్త సర్ లూయిస్ పాశ్చర్ వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28ని ప్రపంచ రేబీస్ నియంత్రణ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రేబీస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశు వైద్యశాలల్లో మంగళవారం కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం 2,600 డోసులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రేబీస్ వ్యాప్తి ఇలా.. ‘రాబ్డో’ కుటుంబానికి చెందిన ‘లిస్సా’ వైరస్ కారణంగా రేబీస్ వ్యాధి వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఆవులు, గొర్రెలు, పందులు, గుర్రాల్లో ఈ వైరస్ కనిపిస్తుంది. వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కనో, ఇతర జంతువునో, మనిషినో కరచినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. 90 శాతం కుక్కల వల్లనే మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కుక్క కాటు వేయగానే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది న్యూరో మస్కులర్ స్టిండిల్ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది. అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. శ్వాస దిగ్బంధనం వల్ల రేబీస్ వ్యాధి సోకిన కుక్క చనిపోతుంది. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన లక్షణాలు (ఫ్యూరియస్ ఫారం), మరొకటి తీవ్రత తక్కువ గల లక్షణాలు (డంబ్ ఫారం). తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే వ్యాధికి గురైన కుక్కలు శబ్ధాలకు అతిగా స్పందిస్తాయి. ఇతర జంతువులు, మనుషులు, చలనం లేని వస్తువులపై దాడి చేస్తుంటాయి. నడకలో కాళ్ల సమన్వయం లేకుండా పోవడం, పిచ్చిగా విపరీతంగా అరవడం చేస్తుంటాయి. చివరగా 24 నుంచి 48 గంటలల్లోపు వ్యాధి తారాస్థాయికి చేరుకుని పక్షవాతానికి గురై మరణిస్తుంది. ఇక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వాటిలో వెనుక కాళ్లు మడత పడుతుంటాయి. తరచుగా తోక ఒకవైపు ఒరిగి ఉంటుంది. శబ్ధాలకు స్పందించే గుణం తక్కువగా ఉండి, నోటి నుంచి చొంగ కారుతూ, ఆవలిస్తున్నట్లుగా అరవడం చేస్తుంటాయి. ఇలాంటి లక్షణాలున్న కుక్కలు వారం నుంచి పది రోజుల్లో మరణిస్తాయి. ముందస్తు జాగ్రత్తలతోనే నివారణ ప్రాణాంతక రేబీస్ వ్యాధి సోకకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయ మార్గం. కుక్క కాటుకు గురైన వారు నీటి కొళాయి కింద కార్బలిక్ సబ్బు లేదా డెట్టాల్ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలి. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వల్ల వైరస్ కదలికలను కొంత వరకు తగ్గించవచ్చు. కుక్క కరచిన మొదటి రోజు నుంచి 3, 7, 14, 28, 90వ రోజుల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, పశుసంవర్ధకశాఖ సహకారంతో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు టీకాలు వేయిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
వరల్డ్ జూనోసిస్ డే: ఇదే రోజు ఎందుకో తెలుసా?
జంతువులంటే ఇష్టపడని వారుండరు. ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు, పక్షులు మనుషుల ఆదరణ చూరగొంటున్నాయి. వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడింది. పాలు, మాంసం, రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడు. అయితే పెట్స్ నుంచి రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, ఆంథ్రాక్స్ వంటి అనేక రకాల వ్యాధులు మానవుడికి సంక్రమించే ప్రమాదం ఉంది. వీటి పట్ల మానవుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుంచి వ్యాధి సంక్రమణను నిరోధించవచ్చు. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఇదే రోజు ఎందుకు? మంచిర్యాల అగ్రికల్చర్: 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటినుంచి జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. వీరికి సోకే అవకాశం ఎక్కువ పశువుల కాపరులు, పశువైద్యవృత్తిలో ఉన్నవారు, పశువుల డెయిరీఫాంలలో పనిచేసేవారు, పాల ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునేవారు, సరదాకోసం కుక్కలు, పక్షులను పెంచుకునేవారికి వ్యాధిసోకే అవకాశం ఎక్కువగా ఉంది. జూనోసిస్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుచి, శుభ్రత పాటించడం చాలా అవసరం. పోలీసు శాఖలో విశిష్ట సేవలు ఆసిఫాబాద్‌అర్బన్: హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో 8నెలలపాటు స్నీపర్డాగ్తో శిక్షణ పొందిన అనుభూతి జీవితంలో మర్చిపోలేను. జిల్లా కేంద్రంలో స్నీపర్డాగ్స్ 2, ట్రాకర్ డాగ్స్ 3 ఉన్నాయి. ప్రతిరోజు వాటికి భోజనం పెట్టిన తర్వాతే నేను భుజిస్తా. వాటికి ఆహారంగా రాయల్ కెనాల్ భోజనం అందిస్తాం. పోలీసుశాఖలో డాగ్ విశిష్ట సేవలు అందిస్తుంది. ఇటీవల లింగాపూర్‌లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో డాగ్ చాకచక్యంతోనే వివరాలు సేకరించగలిగాం. ఒక్కో డాగ్ కోసం నెలకు సుమారు రూ.40వేల వరకు వెచ్చిస్తున్నాం. – జి.విలాస్, డాగ్ హైండ్లింగ్ పీసీ, ఆసిఫాబాద్ బ్రూనీతో ఆడుకోవడం చాలా ఇష్టం ఎదులాపురం: మాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మ, నాన్న మాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఖానాపూర్ నుంచి రూ. 12 వేలకు ఫమిలియన్ జాతికి చెందిన కుక్క పిల్ల బ్రూనీని తీసుకొచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీరోజు దానితో ఆడుకుంటున్నాం. బ్రూనీ కొత్త వాళ్లను ఇంటి ఆవరణలోకి రానివ్వకుండా అరుస్తూ ఉంటుంది. దానితో ఆడుకోవడం, దాని బాగోగులు చూసుకోవడమంటే మాకు చాలా ఇష్టం. – శాలినీ, గౌరీ కీర్తన, హౌజింగ్ బోర్డు కాలనీ, ఆదిలాబాద్ కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం ఎదులాపురం: మాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. కుక్కలతో పాటు ఆవులు, మేకలు, గొర్రెలను పెంచుకుంటాం. వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. వాటితో కలిగే ఆనందం చెప్పలేనిది. ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా టీకాలు, మెడిసిన్, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. అదే విధంగా మా ఇంట్లో మూడేళ్ల జర్మన్ షెపడ్ జాతికి చెందిన భాగీ అనే డాగ్‌తో పాటు రాకీ అనే మూడు నెలల రాట్‌విల్లర్ కుక్కపిల్ల కూడా ఉంది. - ఎంబడి శ్రీజ, మావల, ఆదిలాబాద్ అమ్మకు కూతురు.. మాకు చెల్లిలా.. మంచిర్యాలఅగ్రికల్చర్: 25 రోజుల ‘చాక్లెట్ ల్యాబ్రెడ్’ కుక్కపిల్లను తెచ్చి పెంచుకుంటున్నాం. దానికి ‘సూ్నపి’ అని పేరుపెట్టి ముద్దుగా పిలుచుకుంటున్నాం. మా అమ్మకు కూతురిగా మాకు చెల్లెలుగా భావించి ప్రేమగా చూసుకుంటున్నాం. ఉదయం టిఫిన్, రెండు పూటలా అన్నం, రెండు గుడ్లు, పాలు, వారానికి ఒకసారి మాంసం పెడుతున్నాం. ఏడాదికోసారి వ్యాక్సిన్ వేయిస్తున్నాం. వీటికి వేటాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. పోలీసులు ఎక్కువగా ల్యాబ్రెడ్ డాగ్స్ వాడుతారు. – బండారి రుద్రతేజ, ఐబీచౌరస్తా, మంచిర్యాల కుటుంబ సభ్యుల్లో ఒకరిలా.. మంచిర్యాలఅగ్రికల్చర్: మా ఇంట్లో ఐదేళ్లుగా ‘రోష్’ సందడి చేస్తోంది. జమ్మూ నుంచి తీసుకువచ్చిన ‘రాట్ విల్లర్’ జాతికి చెందిన ఈ శునకంపై మాకుటుంబ సభ్యులందరికీ ఎనలేని ప్రేమ. 2016 లో ఐదునెలల వయస్సు ఉన్నప్పుడు తీసుకువచ్చాం. రోష్‌కు మూడు పూటలా భోజనం, పాలు, మాంసం, గుడ్లు అందిస్తున్నాం. రోజూ స్నానం చేయిస్తాం. జాగింగ్‌కు తీసుకెళ్తాం. ఏటా ఆగస్టులో రెబీస్ టీకా వేయిస్తున్నాం. – వేముల లక్ష్మి, రాజేశం, గౌతమినగర్, మంచిర్యాల టీకాలు తప్పనిసరి.. భైంసాటౌన్: కుక్కలు, పిల్లులు వంటి జంతువులను చాలా మంది పెంచుకుంటారు. అయితే ఈ జంతువులు కరిచినప్పుడు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పశు వైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లి పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. పందులు, దోమల ద్వారా మెదడువాపు వ్యాధి, కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సంక్రమిస్తుంది. కుక్క కాటు వేస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. – రమేశ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నేరాల ఛేదనలో కింగ్‌లు జిల్లాలో నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు కేసులను ఛేదించడంలో పోలీసు జాగీలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 9 పోలీసు డాగ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఏడింటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. రోమ రిటైర్మెంట్ కాగా రూమి రెస్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం తార, రాజ, డైన, చెర్రీ, దీప, గోల్డీ, చిన్న రోమా ఉన్నాయి. వీటిలో తార, రాజ, చెర్రీ, దీప, గోల్డీ వీటిని మర్డర్ కేసుల చేదనకు, డైనాను దొంగతనాలు జరిగినప్పుడు, చిన్న రోమాను మత్తు పదార్థాలు, నార్గోటిక్ను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో జాగిలానికి ప్రభుత్వం నెలకు రూ.5150 చెల్లిస్తోంది. వీటి సంరక్షణ చూసేందుకు 11 మంది సిబ్బంది కూడా ఉన్నారు. చిన్న రోమా 2021 ఫిబ్రవరిలో మత్తుపదార్థ నిల్వలను పసిగట్టడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి పసుపు రమేశ్‌కు గోల్డ్ మెడల్ అందజేశారు. ఇటీవల డీజీపీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంటున్న రోమా -
నేడు 6 లక్షల రేబీస్ టీకాలు
సాక్షి, అమరావతి: సంక్రమిత వ్యాధుల దినోత్సవం (జూనోసిస్ డే) కోసం పశుసంవర్ధక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు. 200కు పైగా వ్యాధులు పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయని గుర్తించారు. వాటిలో ప్రధానంగా కుక్కల నుంచి రేబీస్, చిలుకల నుంచి సిట్టకోసిస్, పాడి పశువుల నుంచి క్షయ, అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ, పందుల నుంచి మెదడు వాపు, స్వైన్ ఫ్లూ, ఎలుకలు, అడవి జంతువుల ద్వారా లెప్టోస్పైరోసిస్ వంటివి వ్యాపిస్తున్నాయి. సంక్రమిత వ్యాధుల్లో రేబీస్ ప్రాణాంతకమైనందున జూనోసిస్ డే నాడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, పాలీక్లినిక్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కనీసం 6 లక్షల కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం.. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలి. çసంక్రమిత వ్యాధులను ఏ విధంగా ఎదుర్కోవాలో పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
కరోనా టీకా కోసం వెళ్తే.. కుక్క కాటు వ్యాక్సిన్ వేశారు
కట్టంగూర్: చదువురాని మహిళ.. కరోనా వ్యాక్సిన్ కోసమని ఆస్పత్రికి వెళ్లింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయాలంటూ ఆమె పనిచేస్తున్న బడి హెడ్మాస్టర్ రాసిచ్చిన లేఖనూ తీసుకెళ్లి చూపించింది. కానీ ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కుక్కకాటు టీకా వేయడంతో భయాందోళనకు లోనైంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కట్టంగూర్ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పి.ప్రమీల స్కావెంజర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వైద్యాధికారిని కోరుతూ పాఠశాల హెచ్ఎం లెటర్ రాసి ఇచ్చారు. ప్రమీల ఆ లేఖ తీసుకుని మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూర్ పీహెచ్‌సీకి వచ్చింది. చదువురాని ఆమె కరోనా వ్యాక్సిన్ క్యూ ఏదో తెలియక.. సాధారణ టీకాలు వేసే లైన్లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ హెచ్ఎం ఇచ్చిన లెటర్‌ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్వీ వ్యాక్సిన్ వేసింది. ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రమీల నిలదీయగా.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్నవారు లెటర్ చదివి.. ఇది కరోనా లైన్ కాదని, తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్ అని చెప్పడంతో ప్రమీల భయాందోళనకు గురైంది. ఒకే సిరంజితో ఇద్దరికి ఏఆర్వీ వ్యాక్సిన్‌ను వేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఏఆర్వీ వేయలేదు: వైద్యాధికారి ప్రమీల కరోనా వ్యాక్సిన్ క్యూలో కాకుండా సాధారణ ఏఆర్వీ, టీటీ వ్యాక్సిన్ లైన్లో నిలబడిందని.. దాంతో నర్సు ఆమె కుక్కకాటు టీకా కోసం వచ్చినట్టు భావించి టీటీ ఇంజక్షన్ వేశారని వైద్యాధికారి కల్పన వివరణ ఇచ్చారు. వేర్వేరు సిరంజిలతో అయిటిపాముల మహిళకు ఏఆర్వీ, ప్రమీలకు టీటీ ఇచ్చినట్టు తెలిపారు. టీటీతో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. చదవండి: -
టీకా క్యూనే.. కానీ.. కరోనాకు కాదు
ఈ చిత్రంలో ప్రజలు క్యూలో నిల్చుంది. వ్యాక్సిన్ కోసమే. అయితే కరోనా టీకా కోసం కాదు.. వీరంతా వచ్చింది రేబిస్ వ్యాక్సిన్ కోసం.. ఎండాకాలంలో సహజంగా ఉండే లక్షణాలతో పాటు లాక్‌డౌన్‌తో ఆహారం దొరక్కపోవడంతో కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో రోజురోజుకు బాధితులు పెరిగి పోతున్నారు. శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం కుక్కల దవాఖానా వద్ద టీకా కోసం జనమిలా బారులుతీరారు. రెండో డోసు కష్టాలు.. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. భారీ లైన్లలో నుంచుని తొలి డోసు వేయించుకున్న వారు తాజాగా రెండో డోసు కోసం తెల్లవారుజాము నుంచే పీహెచ్‌సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం మామిళ్లగూడెం పీహెచ్సీలో శుక్రవారం వ్యాక్సిన్ కోసం వచ్చినవారు తమ చెప్పులు ఇలా లైన్లో ఉంచి ఆరోగ్య సిబ్బంది కోసం ఎదురుచూశారు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం. చదవండి: కరోనా ‘వల’కు చిక్కొద్దు..! రాయిని తొలచి.. రావి ఆకుగా మార్చి.. -
కుక్కల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: తమ గ్రామంలో 26 మందిని కుక్కలు కరిచాయని, వాటి నుంచి రక్షణ కల్పించడంతో పాటు రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని నల్లగొండ జిల్లా ముడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన ఉపేందర్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కుక్కకాటుకు వినియోగించే రేబిస్ వ్యాక్సిన్‌ను అన్ని జిల్లాలకు ఎలా సరఫరా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే కన్నెకల్ గ్రామంలో కుక్క కాటు బారిన పడిన వారిని తరలించేందుకు అంబులెన్స్, రేబిస్ వ్యాక్సిన్‌ను గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కన్నెకల్ గ్రామస్తులు తరచుగా కుక్కకాటుకు గురవుతున్నారని, రేబిస్ వ్యాక్సిన్ ఆ గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని పిటిషనర్ తరఫున వేణుధర్‌రెడ్డి నివేదించారు. కన్నెకల్‌లో పశువుల ఆస్పత్రితోపాటు హోమియో ఆస్పత్రి అందుబాటులో ఉన్నాయని, డాక్టర్, నర్సింగ్ సిబ్బందిని నియమించి రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని కోరారు. డాక్టర్‌ను నియమించాలా వద్దా అన్నది విధానపరమైన నిర్ణయమని, ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. -
మార్కెట్లోకి రేబిస్ వ్యాక్సిన్ ‘ఖైరోర్యాబ్’
రేబిస్ వ్యాక్సిన్ ‘ఖైరోర్యాబ్’ను భారత్ బయోటెక్ సంస్థ తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఖైరోన్ బెహ్రింగ్ వ్యాక్సిన్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ సొంత చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ రీలాంచ్ చేసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డా.రేణూ స్వరూప్, జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, రేబిస్నియంత్రణ శాస్త్రవేత్త డా.చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. -
పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!
సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్) నివారణకు రేబిస్ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్ టీకాను ఇస్తారు. జోనోటిక్ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు. 1995లో ప్రపంచంలో రేబిస్ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. జోనోటిక్ వ్యాధి 7 రకాలు ► బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ► వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనీయాసిస్ ► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ► హెల్నింథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ► ఎక్టోపారసైట్స్: స్కేజిస్ పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్): పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ♦ ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ♦ దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్‌ప్లూ వ్యాధి బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. మెదడు వాపు ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి. ఆంత్రాక్స్ దోమ వ్యాధి ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్ ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది. జోనోటిక్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒∙జోనోటిక్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. ⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -
కుక్కా కరవకు.. జ్వరమా రాకు..
కుక్క కరిచిందా.. ‘యాంటీ రేబిస్ వ్యాక్సిన్’ ఇంజెక్షన్ లేదు.. ప్రయివేట్ మందుల షాపుల్లో కొనుక్కొని వేయించుకోండి.. జ్వరం వచ్చిందా.. ‘పేరాసెట్మాల్’ మాత్రలు లేవు. దెబ్బ తగిలిందా.. కట్టు కడదామంటే దూది లేదాయే.. దూదేం ఖర్మ.. సూదికి కూడా కొరతే. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. ఏదైనా రోగమొస్తే జిల్లాలోని ఆసుపత్రులకు వెళ్తే వినిపిస్తున్న సమాధానాలివి.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య విధానం గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మందులకు అరకొర నిధులను కేటాయించింది. దీంతో ఆసుపత్రులను మందుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా గ్రామీణవాసులకు సరైన వైద్యం అందడం లేదు.. కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పీహెచ్సీ (ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో మందులకు కొరత ఏర్పడింది. ఆ శాఖ పరిధిలో 74 పీహెచ్‌సీలున్నాయి. అందులో 34 పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేస్తాయి. రోజుకు ఒక పీహెచ్‌సీకి 50 నుంచి 200 మందికి పైగా ఓపీ (ఔట్ పేషెంట్స్)లు వస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. వీటని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఆ మేరకు ఒక పీహెచ్‌సీకు ఏడాదికి స్ధాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు మందులకు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఆస్పత్రికి ఏడాదికి రూ.3 లక్షలుఅనుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.75 వేల చొప్పున మందులను కొనుగోలు చేయవచ్చు. సర్జికల్ అవసరాలకింద ఆస్పత్రికి నాలుగు నెలలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్ ప్రకారమే సూది.. దూది తదితరాలను కొనుగోలు చేయాలి. సర్జికల్ విభాగానికి కేటాయించే నిధులు సరిపోవడం లేదని గ్రహించిన డీఎంహెచ్ఓ అధికారులు రూ.1.5 కోట్ల బడ్జెట్ కావాలని ప్రతిపాదించారు. ఈ మందులను ఆన్లైన్ ద్వారా కడప రిమ్స్‌లో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ నుంచి కొనుగోలు చేయాల్సివుంటుంది. కుక్క కాటుకు ఇచ్చే ‘యాంటీ రేబిస్ వ్యాక్సిన్’ నిలుపుదల.. రాష్ట్ర ప్రభుత్వం కుక్క కాటుకు వేసే ‘యాంటీ రేబిస్ వ్యాక్సిన్’ ఇంజక్షన్‌ను హైదరాబాద్‌లోని ‘ఇండి ర్యాబ్’ సంస్థ నుంచి తెప్పించేది. ఇప్పుడు ఆ సంస్ధ ఆ ఇంజక్షన్‌ను బ్యాన్ చేసింది. దీంతో ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీతో సంప్రదింపుల జరుపుతోంది. చర్చలు ఇంకా ఇక కొలిక్కి రాలేదు. దీంతో దాదాపు గడిచిన రెండు నెలల నుంచి పీహెచ్‌సీలకు ఈ వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయినట్లుగా సమాచారం. కుక్క ఒక వ్యక్తిని కరిస్తే వెంటనే ఆ ఇంజక్షన్‌ను వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ను కోర్స్ ప్రకారం ఐదు మార్లు వేయించుకోవాలి. అవి పీహెచ్‌సీల్లో లేనందున బయట మందుల షాపులో కొని వేయించుకోవాలి. ఒక డోస్‌కు రూ.380 వరకు ఖర్చవుతుంది. అలా ఐదు మార్లు వేపించుకోవాలంటే నిరుపేదలకు ఆర్ధిక భారమవుతుంది. పైగా కుక్కకాటు బాధితుల సంఖ్య రోజూ పెరుగుతోంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కకాటు బాధితులెందరో. ఈ ఇంజక్షన్‌కు పీహెచ్‌సీల్లోనే కాక దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడింది. మిగతా ఆస్పత్రుల్లో కూడా ఇతర మందులకు కొరత వెంటాడుతోంది. ఇతర మందులకూ కొరతే.. పీహెచ్‌సీలకు ఇటీవల కాలంలో రోగుల సంఖ్య పెరిగింది. ఉదాహరణకు గాలివీడు, సుండుపల్లె, సురభి తదితర పీహెచ్‌సీల్లో 200 వరకు ఓపీ కేసులు వస్తుంటా యి. ఇలాంటి ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో మందులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. అంటే రోగుల సంఖ్య పెరిగినప్పటికీ అనుగుణంగా మందుల బడ్జెట్ మాత్రం పెరగలేదు. దీంతో రోగులు ఎక్కువగా వచ్చే పీహెచ్‌సీల్లో ఈ సమస్య మరింతగా ఏర్పడుతోంది. మూడు నెలల పాటు రావలసిన మందులు రెండు నెలలకు మాత్రమే అయిపోతున్నాయి. తాజాగా జ్వరానికి వాడే ‘పేరాసెట్మాల్’ మాత్రలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. చాలామందిని ఘగర్, బీపీ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. వీటి బారిన గ్రామీ ణులు కూడ పడుతున్నారు. జీవితాంతం మందులు వాడుతూ, వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. పీహెచ్‌సీల్లో ఈ వ్యాధులకు ఒక దానికి రెండు రకాల మందులు మాత్రమే దొరుకుతున్నాయి. సాధారణంగా ఈ జబ్బులకు గురైన వారికి ఘగర్, బీపీ లెవల్స్ ప్రకారం మోతాదును బట్టి మందులను ఇవ్వాలి. అదీ కాంబినేషన్‌తో కూడిన మందులు ఇస్తేనే వ్యాధులు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా చాలా వాటిల్లో గర్భిణుల రక్తహీనత నివారణకు ఇచ్చే ‘ఐరన్ సిక్రోజ్’ మందులకు కూడా కొరత ఏర్పడింది. ఈ పరిస్ధితి పీహెచ్‌సీల్లోనే కాకుం డా దాదాపుగా మిగతా ఆస్పత్రుల్లోనూ కొరత ఏర్పడింది. సకాలంలో మందులు అందడం లేదని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. గత్యంతరం లేక ‘మందులు రాసిస్తాం.. బయట కొనండి’ అని వారు రోగులకు సూచిస్తున్నారు. -
ముంబై వాసులను రక్షిస్తున్న చిరుత పులులు!
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో సంచరించే చిరుత పులులు అప్పుడప్పుడు బయటకు జనావాస ప్రాంతాల్లోకి రావడం చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. వాస్తవానికి వాటి వల్ల ప్రజలకు పెద్దగా ముప్పేమి వాటిల్లడం లేదు. అవి జనావాస ప్రాంతాల్లోకి ప్రజల కోసం రావడం లేదు. వీధి కుక్కల కోసం అవి వస్తున్నాయని, వాటి వల్ల ముంబై ప్రజలకు మేలే ఎక్కువ జరుగుతోందని తేలింది. చిరుత పులులు తాము రోజు తీసుకొనే ఆహారంలో దాదాపు 40 శాతం వీధి కుక్కలే ఉంటున్నాయి. ఈ విషయాలు ‘ఫ్రాంటయిర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. 104 చదరపు కిలోమీటర్లు విస్తరించిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో 42 చిరుత పులులు ఉన్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరి నుంచి ముంబై నగరంలోని ప్రతి కూడలిలో, ప్రతి వీధి చివరలో కొన్ని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముంబై నగరం మొత్తం మీద ఏ రోజున లెక్కించిన సరాసరి 95 వేల వీధి కుక్కలు ఉంటాయన్నది ఓ అంచనా. వీటి వల్ల ఏటా ప్రజలకు 75 వేల గాయాలు అవుతున్నాయి. ఇవి అధికారికంగా నమోదయిన గాయాలు మాత్రమే. నమోదు కాకుండా కూడా మరికొన్ని వేల గాయాలవుతున్నాయన్నది అంచనా. ఈ గాయాల వల్ల రాబిస్ సోకి వందల మంది మరణిస్తున్నారు. అధికారికంగా నమోదైన లెక్కల ప్రకారం గత 20 ఏళ్లలో నగరంలో వీధి కుక్కల గాయాల వల్ల 420 మంది మరణించారు. పార్క్ సమీపంలో ఏడాదికి 800 నుంచి రెండువేల వీధి కుక్కలు చిరుత పులులకు ఆహారంగా మారుతున్నాయని, తద్వారా ముంబై నగరంలో వీధి కుక్కలు అదుపులో ఉంటున్నాయని పాపులేషన్ బయోలజిస్ట్ లెక్స్ ఐబీ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సర్వేయర్ నికిత్ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. చిరుత పులులు వీధి కుక్కలను వేటాడడం వల్ల కుక్కల స్టెరిలైజేషన్‌కు అయ్యే ఖర్చు ఏటా దాదాపు 18 లక్ష రూపాయలు మున్సిపాలిటీకి మిగులుతోందని కూడా సర్వే తేల్చింది. చిరుత పులులను తరలించినట్లయితే... సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నుంచి చిరుత పులులను తరలించినట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది, అటవి ప్రాంతం తరగిపోతుంది. అసంఖ్యాకంగా వీధి కుక్కలు పెరిగి పోతాయి. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా ఏటా వీధి కుక్కల కాట్లు దాదాపు ఐదువేలు పెరుగుతాయి. వాటి చికిత్స కోసం ఏటా 1.38 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. చిరుత పులులు కుక్కలు, పందులనే కాకుండా అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పుడు ప్రజలు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2002లోనే 25 మంది చిరుత పులుల కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ సంఘటనలపై దర్యాప్తు జరపగా ఇతర పార్కుల నుంచి నేషనల్ పార్కుకు తరలించిన చిరుతల వల్లనే ఆ దాడులు జరిగాయని తేలింది. పార్క్‌లో ఉన్న చిరుతలు పూర్తిగా కుక్కల ఆహారానికే అలవాటు పడ్డాయి. గత నాలుగేళ్లుగా చిరుతల కారణంగా ఒక్కరు కూడా ఇక్కడ మృత్యువాత పడకపోవడం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తోంది. -
గుంటూరు ఘటన మేల్కొల్పేనా..?
చిత్తూరు అర్బన్ : ఇటీవల జిల్లాలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. కుక్కకాట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలను వీధిలోకి ఒంటరిగా పంపాలంటే హడలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరులో వీధి కుక్కల దాడిలో ప్రేమ్‌కుమార్ అనే మూడేళ్ల బాలుడు మృత్యువాత పడటం పాలకులకు గుణపాఠం కావాలి.జిల్లాలోని పట్టణాల్లో 26 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల వరకు శునకాలున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల్ని పెంచుకుంటున్న కొందరు వీటికి అప్పుడప్పుడు యాంటీ రేబిస్ టీకాలు వేయిస్తున్నారు. కుక్కల జనాభాలో రేబిస్ టీకాలు వేస్తున్న కుక్కల సంఖ్య పది శాతం మాత్రమే. మిగిలిన కుక్కులు వీధుల్లో తిరుగుతూ దొరికిన వాళ్లను దొరికినట్లు కొరుకుతున్నాయి. కుక్కల స్టెరిలైజేషన్ చేసినట్టు ఖర్చులకు సంబంధించిన కాగితాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఉన్నా ఉపయోగంలేదు... జిల్లాలో సగటున ఏటా 30 వేల మంది బాధితులు కుక్కకాట్లకు గురవుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఆస్పత్రులకంటే.. ప్రైవేటు వైద్యం వైపే జనం ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటులో కుక్కకాటుకు వేసే యాంటీ రేబిస్ సూది మందు, ఇమ్యునోగ్లోబ్ ఇంజెక్షన్ ఒక్కొక్కటి రూ.3 వేలు ఉన్నా బాధితులు అక్కడికే వెళుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది మందులు అందుబాటులో ఉన్నా సక్రమంగా వినియోగించకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలోని 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమృద్ధిగా కుక్కకాట్లకు సూది మందులు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల సిబ్బందిలో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఒక్కో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వైలిన్ ఓపెన్ చేస్తే పది మందికి వేయాలి. ఒక్కరికి వేసినా 24 గంటల్లో మిగిలిన మందును పడేయాలి. జిల్లాలోని పలుచోట్ల ఒక్కరికోసం వైలిన్ ఎలా వేయగలమంటూ బాధితుల్ని వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు పంపేస్తున్నారు. కాసులు కురిపిస్తున్న స్టెరిలైజేషన్ వీధి కుక్కల నిర్మూలనకు గతంలో కుక్కల్ని పట్టి చంపేసేవారు. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకత రావడంతో కుక్కల్ని చంపడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కుక్కల జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స ఒక్కటే మార్గంగా నిలిచింది. ఇదే పాలకులకు, అధికారులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో వీధి కుక్కలకు శస్త్ర చికిత్స చేయడానికి ఆయా మునిసిపల్ కమిషనర్లు తిరుపతిలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు పనులు అప్పగించారు. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసి, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయడానికి రూ.450 చొప్పున స్వచ్ఛంద సేవా సంస్థ వసూలు చేస్తోంది. మునిసిపాలిటీల్లో ఏటా రూ.50 లక్షలకు పైగా కుక్కల స్టెరిలైజేషన్‌కు బిల్లులు చెల్లిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ యథేచ్ఛగా నిధులను బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు -
ప్రాణం తీసిన నాటు వైద్యం
నల్లకుంటః రేబీస్ సోకిన పదేళ్ల బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన డోమ్మిక్ కుమారుడు రేనాల్డ్(10) 25 రోజుల క్రితం వీధికుక్క దాడిలో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడికి స్థానిక ఆస్పత్రిలో టీటీ ఇంజక్షన్ వేయించినా తరువాత నాటు వైద్యం చేయించారు. సోమవారం అతను వింతగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి వార్డు 7లో ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. అతను కోలుకోలేక సాయంత్రం మృతి చెందాడు. రిగ్ ఇంజక్షన్ తీసుకోవాలి: డాక్టర్ చిత్రలేఖ కుక్క కరిస్తే వెంటనే రేబీస్ ఇమ్యూనో గ్లాబులిన్ (రిగ్) ఇంజక్షన్ తీసుకోవాలి. నిర్లక్ష్యం చేసినా, పసరు వైద్యం చేయించినా ప్రాణాలకు ప్రమాదం. రిగ్ ఇంజక్షన్స్ ఫీవర్‌లో ఉచితంగా ఇస్తారు. రేబీస్‌కు చికిత్స లేదు. -
రేబీస్‌తో చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం రేబీస్‌తో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లో నివాసముండే మిర్యాల శ్రీనివాసులు, మానస దంపతులు ఏకైక కుమార్తె ఉషశ్రీ(3)ను మూడు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఆదివారం చికిత్సల కోసం నీలోఫర్‌కు తీసుకు వెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నారికి రేబిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం రాత్రి చిన్నారిని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించారు. కాగా సోమవారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది. మరో బాలునికి రేబిస్ నిజామాబాద్ జిల్లా బీల్‌గల్ మండలం తాళ్లపల్లికి చెందిన రవి కుమారుడు గణేష్(9)ని రెండు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు బాలునికి రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. కాగా రెండు రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్న బాలున్ని స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం రాత్రి బాలున్ని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబిస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అయితే ఆ బాలుని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పిస్తామంటూ సోమవారం ఉదయం బాలున్ని తీసుకు వెళ్లారు. -
రేబిస్ తో యువకుడు మృతి
రేపల్లె (గుంటూరు) : కుక్క కరిచినా వైద్యం చేయించడంలో నిర్లక్ష్యం వహించడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని 17వ వార్డులో మూడు రోజుల క్రితం ఆనంద్(17) అనే యువకుడిని ఓ పిచ్చి కుక్క కరిచింది. స్వల్ప గాయాలు కావడంతో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోకుండా కేవలం ప్రాథమిక వైద్యం చేయించారు. అయితే సోమవారం ఆనంద్ పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్‌కు రేబిస్ సోకిందని, బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆనంద్‌ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకురాగా, సోమవారం సాయంత్రం మృతి చెందాడు. -
జంతువులతో జాగ్రత్త సుమా...
జంతువుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఇందులో ప్రధానంగా రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్వైన్‌ప్లూ, టీబీ, బర్డ్‌ప్లూ ప్రమాదకరమైనవి. రేబిస్ వ్యాధి: రాబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కుక్కల లాలాజలంలో ఉండే రాబిస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కోసం ప్రతీ సంవత్సరం వ్యాధి నిరోధక టీకాలు పెంపుడు జంతువులకు తప్పని సరిగా ఇప్పించినట్లైయితే మనుషులకు ఈ వ్యాధులు సోకకుండా ఉంటాయి. ఆంత్రాక్స్: ఈ వ్యాధి ఆంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వ స్తుంది. ఇది ఎక్కువగా గొర్రెలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న గొర్రెపొటేళ్ళ మాంసం తిన్న మనుషులకు వస్తుంది. బర్డ్‌ప్లూ: ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది. టీబీ... దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. -
రేబిస్‌తో బాలుడు మృతి
నల్లకుంట (హైదరాబాద్) : రేబిస్ వ్యాధితో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పొత్తూరు మండలం మాలచింతపల్లి గ్రామానికి చెందిన ఎన్.బాలస్వామి కుమారుడు లెనిన్(10)ను కొద్ది రోజుల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. అయితే రెండు రోజుల నుంచి లెనిన్ వింతగా ప్రవర్తిస్తుండడంతో అతడిని సోమవారం సాయంత్రం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించారు. కాగా పరిస్థితి విషమించడంతో లెనిన్ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. -
బాలుడిలో రేబిస్ వ్యాధి లక్షణాలు
హైదరాబాద్: రేబిస్ వ్యాధి లక్షణాలున్న ఓ మూడేళ్ల బాలుడిని చికిత్స కోసం తల్లిదండ్రులు సోమవారం నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ బాలుడికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ లేగ దూడను పిచ్చి కుక్క కరిస్తే... ఆ దూడ తల్లి పాలను తాగడం వల్ల రేబిస్ వ్యాధి వస్తుందా అన్నది ఇక్కడ అంతుపట్టని విషయంగా ఉంది. కేసు వివరాలను పరిశీలిస్తే... నల్లగొండ జిల్లా వట్టిపర్తి దుబ్బతండాలో గతేడాది జనవరి 14న ఓ పిచ్చి కుక్క ఒక గేదె దూడను కరిచింది. మూడు నెలల తర్వాత ఆ దూడ రేబిస్‌తో మృతి చెందింది. అయితే, అదే తండాకు చెందిన రమేశ్ అనే వ్యక్తి రేబీస్‌తో మృతి చెందిన లేగదూడ తల్లి గేదె పాలను మూడు నెలల పాటు తన రెండేళ్ల కుమారుడు విష్ణుకు తాగించారు. అయితే ఉన్నట్టుండి విష్ణు గత నాలుగు రోజులుగా జంతువులా ప్రవర్తించడం, ఒంటిపై ఉన్న దుస్తులు చింపేసుకోవడంతో పాటు కుక్క వచ్చిందంటూ గట్టిగా అరుస్తున్నాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి రేబీస్ అనే అనుమానంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో తండ్రి రమేశ్ సోమవారం విష్ణును ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. బాలున్ని పరీక్షించిన వైద్యులు రేబీస్ అనుమానిత కేసుగా గుర్తించి చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ, బాలుడికి రేబీస్ వ్యాధి సోకిందా? లేదా అన్నది తెలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. (నల్లకుంట)