చిన్నారి చెవి తినేసిన కుక్క... | one-and-half old baby injured in dog attack | Sakshi
Sakshi News home page

చిన్నారి చెవి తినేసిన కుక్క...

Published Tue, Dec 2 2014 10:38 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

చిన్నారి చెవి తినేసిన కుక్క... - Sakshi

చిన్నారి చెవి తినేసిన కుక్క...

హైదరాబాద్ : నిద్రపోతున్న చిన్నారిపై కుక్క దాడి చేసి...చెవి, తల భాగాలను కొరికి తినేసింది. వివరాల్లోకి వెళితే బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్లో ఉండే మంజుల తన ఏడాదిన్నర పాప ప్రసన్నను నిద్ర పుచ్చి బయటకు వెళ్లింది. ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ ఓ కుక్క చిన్నారి చెవిని 90 శాతం తినేసింది. తర్వాత తల కొరికింది. పీక పట్టుకునేందుకు యత్నిస్తుండగా పాప ఏడుపు విని తల్లి పరిగెత్తుకొచ్చింది. దీంతో కుక్క పారిపోయింది.

పాపను చికిత్స నిమిత్తం సమీపంలోని పేస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా...వైద్యులు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ చేశారు. తల భాగంలో కుక్క కరవడంతో రాబిస్ త్వరగా శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉందని, 48 గంటల తర్వాత మాత్రమే పాప ఆరోగ్య పరిస్థితిపై ఒక అవగాహన వస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement