పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..! | Special Story On Zoonoses Day | Sakshi
Sakshi News home page

పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!

Published Fri, Jul 5 2019 12:54 PM | Last Updated on Fri, Jul 5 2019 12:56 PM

Special Story On Zoonoses Day - Sakshi

సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్‌ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును  ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్‌ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్‌’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్‌) నివారణకు రేబిస్‌ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్‌ మీస్టర్‌ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు.

అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్‌ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్‌ టీకాను ఇస్తారు. జోనోటిక్‌ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్‌ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్‌ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు.

1995లో ప్రపంచంలో రేబిస్‌ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్‌ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్‌ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ అరుణ వివరించారు.

జోనోటిక్‌ వ్యాధి 7 రకాలు 
బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్‌ లెప్టోస్పైరోసిస్, క్షయ 
► వైరస్‌:  రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్‌ 
► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్‌మెనీయాసిస్‌ 
► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్‌ 
► హెల్నింథ్స్‌: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్‌ 
► ఎక్టోపారసైట్స్‌: స్కేజిస్‌

పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్‌): 
పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్‌. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్‌’ వైరస్‌ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 
మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. 
ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు.  
దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు.

నివారణ: 
కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలి.

బర్డ్‌ప్లూ వ్యాధి
బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్‌ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది.

మెదడు వాపు
ఇది వైరస్‌ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్‌ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి.

ఆంత్రాక్స్‌ దోమ వ్యాధి
ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది.

బ్రూసెల్లోసిస్‌
ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్‌ బూసెల్లా మెలిటెన్సిస్‌ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది.

జోనోటిక్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు   
∙జోనోటిక్‌ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. 
⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్‌ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి.  
⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్‌ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement