మృతి చెందిన రేనాల్డ్
ప్రాణం తీసిన నాటు వైద్యం
Published Mon, Aug 29 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
నల్లకుంటః రేబీస్ సోకిన పదేళ్ల బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన డోమ్మిక్ కుమారుడు రేనాల్డ్(10) 25 రోజుల క్రితం వీధికుక్క దాడిలో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడికి స్థానిక ఆస్పత్రిలో టీటీ ఇంజక్షన్ వేయించినా తరువాత నాటు వైద్యం చేయించారు. సోమవారం అతను వింతగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి వార్డు 7లో ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. అతను కోలుకోలేక సాయంత్రం మృతి చెందాడు.
రిగ్ ఇంజక్షన్ తీసుకోవాలి: డాక్టర్ చిత్రలేఖ
కుక్క కరిస్తే వెంటనే రేబీస్ ఇమ్యూనో గ్లాబులిన్ (రిగ్) ఇంజక్షన్ తీసుకోవాలి. నిర్లక్ష్యం చేసినా, పసరు వైద్యం చేయించినా ప్రాణాలకు ప్రమాదం. రిగ్ ఇంజక్షన్స్ ఫీవర్‌లో ఉచితంగా ఇస్తారు. రేబీస్‌కు చికిత్స లేదు.
Advertisement