రేపల్లె (గుంటూరు) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం చింగుపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నన్నేపాముల లాజర్(35) తనకున్న రెండెకరాలతో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గతేడాది కూడా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది కూడా దిగుబడి వచ్చేలా కనిపించకపోవడంతో.. ఇంట్లో ఉన్న గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.