రేపల్లెలో మిన్నంటిన సంబరాలు
Published Tue, Sep 17 2013 4:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
రేపల్లె, న్యూస్‌లైన్: రేపల్లె నియోజకర్గంలో సోమవారం సాయంత్రం పండుగ వాతావారణం నెలకొంది. రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు 45 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 2012 మే 24వ తేదీ నుంచి మోపిదేవి చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
అయ్యప్ప మాల ధరించిన ఆయనకు శబరిమలై యాత్ర వెళ్లేందుకు సీబీఐ కోర్టు గత డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతినటంతో పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సీబీఐ వ్యతిరేకించింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎన్నిసార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం వెలువడిన బెయిల్ వారిలో ఆనందం నింపింది. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బాణసంచా కాల్చుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గడ్డం రాధాకృష్ణామూ ర్తి, బేతపూడి కోటేశ్వరావు, రెడ్డి శంకర్, ఐనాల సాంబశివరావు, యార్లగడ్డ వెంకటేశ్వరావు(చినబాబు), యలమనేని కిషోర్‌కుమార్, యార్లగడ్డ మదన్‌మోహన్, వేజళ్ల కృష్ణమోహన్, చిత్రాల ఒబే దు, చిమటా బాలాజీ, అల్లంశెట్టి శ్రీనివాసరావు, జడల వాసు, పీబీఎన్.శర్మ, డొక్కు నాగేశ్వరావు, బొర్రా వెంకటేశ్వరావు, ఒడుగు రాంబాబు, తులసి దుర్గాప్రసాద్, బిక్షాలు,పాల్గొన్నారు.
Advertisement
Advertisement