
సాక్షి, గుంటూరు: చంద్రబాబు గుంటూరు సభలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కాగా, ఈ ఘటనపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి సామాన్యులు బలి అవుతున్నారు. జరిగిన దుర్ఘటనలకు చంద్రబాబుదే బాధ్యత. చంద్రబాబుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము.
ఇక, మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ.. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. నాడు గోదావరి పుష్కరాల్లో 29 మందని బలితీసుకున్నాడు. మొన్న కందుకూరులో 8 మంది మృతికి కారణమయ్యారు. ప్రభుత్వం ఉపేక్షించేది లేదు.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు.. ఘటనా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment