సాక్షి, కాకినాడ: విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు.
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు.. చంద్రబాబుకు పనిలేక ఖాళీగా ఉన్నాడని ఎవరు పిలుస్తారా? వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు.
వారిని పరామర్శించావా బాబూ!
2014 - 2019 మధ్యలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? వనజాక్షిపై నీ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం వనజాక్షిని పరామర్శించావా? రెండు నెలల క్రితమే టీడీపీ స్థానిక కౌన్సిలర్ హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఖాళీగానే ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించని నేత చంద్రబాబు. చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన చేశారని బోరున ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు. మా కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తాం.
పవన్‌కు వాస్తవాలు తెలియవు
పవన్ లాగా నాకేమీ ప్యాకేజీ డబ్బులు రావటం లేదు. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి అమరనాథ్ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచాను. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివే పవన్‌కు వాస్తవాలు తెలియవు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకుని రావటానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హార్బర్లు కట్టిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ అప్పటికప్పుడే ఇచ్చే ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం. 2024లో కూడా జగనే సీఎం ఖాయం’ అని మోపిదేవి పేర్కొన్నారు.
చదవండి: పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో!
ఇది సినిమా కాదు, రాజకీయం
పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో హడావిడీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్.. ఇది సినిమా కాదు, రాజకీయం అని హితవు పలికారు. సీఎం అవుతానంటున్న పవన్ భాష సరిగా లేదని, సభ్యత లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. ఏదైనా ఆరోపించామంటే కనీస ఆధారాలు ఉండాలి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడు. పవన్‌తాను ఎక్కడా కుల రాజకీయం చేయనంటుంటాడు. కులాల ప్రస్తావన లేకుండా పవన్ ఎక్కడైనా మాట్లాడాడా?. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీయే. టీడీపీ ఆవిర్భావంతో కులాల కుంపట్లు ప్రారంభం అయ్యాయి. 80 శాతం కాపులు సీఎం జగన్‌కే మద్దతు తెలుపుతున్నారు. పవన్ చంద్రశేఖర్‌రెడ్డిపై పోటీ చేయాలి. కాకినాడలో పోటీ విషయంపై ద్వారంపూడి సవాల్‌కు ఇవాళైనా పవన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి’ అని కన్నబాబు పేర్కొన్నారు.
అవినీతి రాక్షసుడు చంద్రబాబు
‘నాలుగు దశాబ్ధాలుగా ఏపీని పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో లబ్ది పొందాలని చూస్తున్నాడు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని. వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడుతునఆనడో తనకే తెలియట్లే. చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడుతున్నాడు. కాపుల పరువు తీసేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడు. పవన్ వ్యాఖ్యలకు బాధపడే ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో?. పవన్‌కు అపాయం జరిగితే చంద్రబాబుకే సానుభూతి వస్తుంది. చంద్బరాబు నుంచే పవన్‌కు పెను ప్రమాద పొంచి ఉంది. పవన్‌కు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.’
-మంత్రి కొట్టు సత్యనారాయణ
‘ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఆయన కుటుంబం పట్ల పవన్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్.. పార్టీని నడింపించాల్సిన విధానం ఇదేనా?. దూషణలు, పరుష పదజాలంతో పవన్ మాట్లాడుతున్నాడు. యువతకు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?. ద్వారంపూడిపై పవన్ మాట్లాడిన భాష అభ్యంతరం. సీఎం జగన్ వారసత్వంగా రాలేదు. ఒక నాయకత్వ లక్షణంతో ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గతిని మార్చిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఒక దైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చారు.
-ఎంపీ వంగా గీత
Comments
Please login to add a commentAdd a comment