సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment