ongole rims hospital
-
AP: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. -
సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స
సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) కొద్దిరోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. -
కామాంధుల అరెస్టు
ఒంగోలు/ సాక్షి, అమరావతి: బాలికపై సామూహిక లైంగిక దాడి కేసును ఒంగోలు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లి మందలించిందని ఇల్లు విడిచి ఒంగోలు చేరుకున్న బాలికను ఆరుగురు యువకులు మభ్యపెట్టి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఘటన వివరాలు వెల్లడించారు. నమ్మించి నయవంచన గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన బాలిక ఈ ఏడాది మేలో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తాతయ్యకు సాయంగా ఉండేందుకు వెళ్లింది. అదే సమయంలో ఒంగోలులో కారు డ్రైవర్‌గా పనిచేసే అమ్మిశెట్టి రాము అదే ఆసుపత్రికి ఓ పేషెంట్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి జూన్ 15న కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక రాముకు ఫోన్ చేసి, తాను ఒంగోలుకు వస్తున్నట్లు చెప్పింది. 16వ తేదీ రాత్రి 7 గంటలకు ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. రామును కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్టాండ్‌లో కేఆర్ మొబైల్స్ దుకాణంలో పనిచేసే రెండు చేతులు లేని దివ్యాంగుడైన షేక్ బాజీని రాముకు కాల్ చేసేందుకు ఫోన్ ఇవ్వమని అభ్యర్థించింది. షేక్ బాజీ ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి బాలికను మొబైల్స్ దుకాణం వెనుక భాగంలో ఉన్న సర్వీసింగ్ రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 17వ తేదీ అర్ధరాత్రి బాజీ, అతడి స్నేహితులైన ఆవుల శ్రీకాంత్‌రెడ్డి, మరో మైనర్ బాలుడు షాపులోకి వచ్చి బాలికతో మాట కలిపారు. రాము వద్దకు తీసుకెళతామని నమ్మబలికి ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బయటకు రాకుండా గదిలోనే నిర్బంధించారు. 19వ తేదీన బాజీ, శ్రీకాంత్‌రెడ్డి, మైనర్ బాలుడు బయటకు వెళ్లిపోయారు. తర్వాత మహేష్ అనే వ్యక్తి, మరో ఇద్దరు మైనర్లు వచ్చి బాధితురాలిపై లైంగిక దాడికి దిగారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు బాలికపై ఈ అరాచకం కొనసాగించారు. 22న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మైనర్లలో ఒకడు ఆమెను ఒంగోలు బస్టాండ్ వద్దకు తీసుకొచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. బస్టాండ్ ఆవరణలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ సంచరిస్తున్న బాధితురాలిని గమనించిన హోంగార్డు వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సీతారామయ్య దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే శక్తి టీమ్‌ను అప్రమత్తం చేసి, బాలిక నుంచి విషయం రాబట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం చర్యలు బాలికపై లైంగిక దాడి కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు మైనర్లు అని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్లయిన మైనంపాడుకు చెందిన ప్రధాన నిందితుడు షేక్ బాజీ, యం.నిడమానూరుకు చెందిన రెండో నిందితుడు రావుల శ్రీకాంత్‌రెడ్డి, ఆరో నిందితుడైన మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లికి చెందిన పాత్ర మహేష్‌లను అరెస్టు చేశామన్నారు. బాలిక అదృశ్యమైనట్లు గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్లో ఈ నెల 19న కేసు నమోదైనట్లు వెల్లడించారు. నిందితులపై ‘పోస్కో’ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బాధితురాలికి మంత్రి బాలినేని పరామర్శ అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యాచార ఘటన గురించి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు వివరాలు తెలియజేశారు. -
ఆ కేసూ ‘మాఫీ’ యా!
కేసు దర్యాప్తు చేసిందీ లేదు.. మృతుడి పోస్టుమార్టం నివేదికా అందలేదు.. పోనీ ‘మద్యం తాగుతూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడంటున్న’ ప్రత్యక్ష సాక్షుల వాదనను అసలే పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ గుండెపోటుతోనే అని ఏకపక్షంగా తేల్చేసి..సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు క్లోజ్ చేసేశారు.. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలోని లిక్కర్ మాఫియా పోలీసు, అబ్కారీ శాఖలపై ఎంతగా స్వారీ చేస్తోందో.. కేసులను ఎలా మేనేజ్ చేస్తోందో.. స్పష్టం చేస్తున్న సంఘటన ఇది. ఎంవీపీ కాలనీలోని వెలగపూడి సిండికేట్‌కు చెందిన శ్రీవిజయ వైన్ షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములో తిరుమలరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మద్యం సేవిస్తూ అక్కడే కుప్పకూలి మరణించగా.. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని పోలీసులు పేర్కొనడం చూస్తే.. సిండికేట్ నిర్వాహకులను కేసు నుంచి తప్పించే ఉద్దేశం స్పష్టమవుతోంది. కనీసం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకైనా ఆగకుండా గుండెపోటు మరణమని తేల్చేసి.. కేసును మాఫీ చేసేయడం విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్ మాఫియా.. ఓ కళాకారుడి మృతి కేసును తారుమారు చేసేసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ సిండికేట్‌కు చెందిన ఎంవీపీ కాలనీలోని శ్రీ విజయ వైన్స్‌లో మర్రిపాలెంకు చెందిన కీ బోర్డ్ కళాకారుడు ఎం.తిరుమలరావు(48) శుక్రవారం రాత్రి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతి చెందాడని శుక్రవారం రాత్రి ప్రత్యక్షసాక్షులు స్పష్టం చేయగా... శనివారం సాయంత్రానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. వైన్ షాపులో మద్యం కొని బాటిల్ మూత తీయకుండానే ఫిట్స్ వచ్చి పర్మిట్ రూమ్‌లో కుప్పకూలిన అతన్ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మరణించాడని ప్రకటించారు. వాస్తవానికి తిరుమలరావు అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ‘‘శ్రీ విజయ వైన్స్‌కు సమీపంలోని శ్రీ సాయిరామా శక్తి లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం ముగింపు దృష్ట్యా శుక్రవారం రాత్రి జాగారం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు తిరుమలరావు వచ్చారు. అప్పటి వరకు గుడిలోనే ఉన్న ఆయన సాయంత్రం 6గంటల సమయంలో చిన్న పనుంది.. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లారు. అర్ధగంటయినా రాకపోవడంతో మేము ఆరా తీయగా.. పక్కనే ఉన్న వైన్ షాపులోకి వెళ్లి కుప్పకూలాడని తెలిసింది. మేము హుటాహుటిన వెళ్లేటప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.. కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయమన్నా... ముందు వైన్‌షాపు నిర్వాహకులు అంగీకరించలేదు. ఆటోలో తీసుకుపొమ్మని గదమయించారు. గట్టిగా అడిగిన మీదట ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించారు.. అప్పటికే అతను మృతి చెంచాడని అంబులెన్స్ వైద్య సిబ్బంది తేల్చారు.’’ అని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు చెబుతున్నారు. కానీ శనివారం నాడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలో మృతి చెందినట్టు ప్రకటించారు. వైన్‌షాపు యాజమాన్యానికి కనీసంగా ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకే ఘటనా స్థలంలో కాకుండా మార్గమధ్యలో చనిపోయినట్టు పోలీసులు కొత్త కథ అల్లినట్టు అర్ధమవుతోంది. శనివారం ఉదయం కేజీహెచ్‌లో తిరుమలరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించగా.. ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం అతను గుండెపోటుతోనే చనిపోయాడని నివేదికలో తేలినట్టు చెబుతున్నారు. మరో పక్క తిరుమలరావు కుటుంబసభ్యులు కూడా అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వివాదం చేసుకున్నా వచ్చేదేమీ లేదు.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరూ చెబుతున్నారు.. అదే నిజమని అనుకుంటున్నాం... అని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే వెలగపూడి లిక్కర్ మాఫియా వ్యవస్థలను, వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ బాటిళ్లు సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ నాయుడు శ్రీ విజయ వైన్స్‌లో తిరుమలరావు కొనుగోలు చేసిన మాన్షన్ హౌస్ బ్రాందీ 180ఎంఎల్ బాటిల్‌ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించాం... షాపులోని ఆ బ్రాండ్‌కు చెందిన 249 బాటిళ్లను విక్రయించకుండా సీజ్ చేశాం.. అని ఎక్సైజ్ సీఐ పాపునాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ తిరుమలరావు మృతి
ఒంగోలు : గత ఐదు రోజుల నుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం నాడు మృతిచెందాడు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో ఐదురోజుల కిందట మనుసాగర్ అనే బాలుడిని క్షుద్రపూజల కోసం తిరుమలరావు బలిచ్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు తిరుమలరావుపై ఆగ్రహంచి, కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా తీవ్ర గాయాలపాలైన విషయం విదితమే. అప్పటినుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలరావు శనివారం సాయంత్రం మృతిచెందాడు.