Alla Nani Inquired About Dental Dr. Dhanalakshmi Health Condition - Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ధనలక్ష్మి ఆరోగ్యంపై మంత్రి ఆరా..

Published Thu, Feb 4 2021 12:13 PM | Last Updated on Thu, Feb 4 2021 2:28 PM

Alla Nani Inquired Ongole Rims Dental Dr Dhanalakshmi Health Condition - Sakshi

సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్‌ డాక్టర్‌ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్‌ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..)

కొద్దిరోజుల్లోనే డాక్టర్‌ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యే  అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్‌)

స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement