అన్నానగర్(చెన్నై): ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఓ డాక్టర్ రూ.60 లక్షలు మోసం చేశాడు. అడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని వెస్ట్ మాంబళం ప్రాంతానికి చెందిన ఓ యువ పట్టభద్రురాలు ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈమెకు ఎంజీఆర్ నగర్ సమీపంలోని జాపర్‌ఖాన్ పేట ప్రాంతానికి చెందిన డాక్టర్ మనోజ్ చార్లెస్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ స్థితిలో చార్లెస్ ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అంటూ యువతి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.
ఆ యువతి వద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇప్పటివరకు రూ. 60 లక్షలు తీసుకున్నాడు. తీరా చార్లెస్ ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. ఈ విషయమై ఆమె చార్లెస్‌ను ప్రశ్నంచగా అడిగితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వైద్యుడిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అశోక్‌నగర్ ఆల్ మహిళా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు మోసం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మనోజ్ చార్లెస్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు.
చదవండి: రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
Comments
Please login to add a commentAdd a comment