Doctor Reveals His Pay Was Rs 9,000 Even 16 Years After MBBS - Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ పూర్తి అయ్యి 16 ఏళ్లట. ఇప్పటికీ అదే జీతమట!

Published Fri, Apr 7 2023 10:55 AM | Last Updated on Fri, Apr 7 2023 12:23 PM

Doctor Reveals His Pay Was Rs 9000 Even 16 Years After MBBS  - Sakshi

కొందరి ఉద్యోగంలో ఉన్నతి ఉండక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే! అన్నట్లుగా ఉంటుంది. ఏం చేద్దాం అన్న కలిసిరాదు. కనీసం ఏళ్లుగా చేస్తున్నాడు కదా అని యజమాన్యం కూడా జాలి చూపదు. ఆ ఉద్యోగి నా వల్ల కాదని రాజీనామ చేసేంత వరకు పరిస్థితి అంతే అన్నట్లు ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితిని ఓ డాక్టర్‌ ఎదర్కొంటున్నాడు. 

వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లోని అపోలా హాస్పటల్స్‌లో పనిచేస్తేన్న బిహార్‌కి చెందిన న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ అరకొర జీతాన్ని ఎంత పొదుపుగా వాడాలో నేర్చుకున్నాని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించాడు.  తాను 2004లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశానని, 16 ఏళ్ల నుంచి ఒకే జీతం అందుకున్నట్లు తెలిపాడు.

ప్రాక్టీస్‌ మొదలు పెట్టినప్పటి నుంచి అంతే జీతం అని చెబుతున్నాడు.  దీంతో తన కుటుంబసభ్యులు ఎవరూ కూడా చూసేందుకు రావడం కూడా మానేసిట్లు తెలిపాడు. అలాగే తన నాన్న పనిచేసే ప్రభుత్వ కార్యాలయం ఫ్యూన్‌ జీతం, కొడుకు జీతం ఒకటేనని అమ్మ బాధపడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు.

తాను తమిళనాడులోని వెల్లూరులో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు వైద్యుడు సుధీర్‌ తెలిపారు. తాను అడ్మిషన్‌ తీసుకున్నప్పటి నుంచి ఐదేళ్లు ఎంబీబీఎస్‌ పూర్తి అయ్యే వరకు కూడా తన ఖర్చులన్నీ తానే నిర్వహించుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఆ సమయంలో తనను చూసేందకు కూడా వచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు.  

ఒక జూనియర్‌ డాక్టర్‌ తను జీవించడానికే ఇంతలా కష్టపడుతున్నప్పుడూ.. ఎలా సామాజిక సేవ చేయగలను అని పోస్ట్‌ పెట్డడంతో రిప్లైగా సదరు వైద్యుడు సుధీర్‌ తన గురించి వివరించాడు. ఈ విషయం నెట్టిట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు భారతదేశంలో వైద్యులకు తగిన జీతాలు లభించడం లేదని ఒకరు, పేషంట్‌ల దగ్గర నుంచి భారీగా వసూలు చేసే ఆస్పత్రి యాజమాన్యం వైద్యులకు మాత్రం తగిన జీతాల ఇవ్వదంటూ మండిపడుతూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement