రేపల్లె (గుంటూరు) : రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమయ్యింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయపాలెం గ్రామానికి చెందిన సాల్మన్‌రాజు రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కిడ్నాప్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే గురువారం కృష్ణానది తీరంలో బాలుడి మృతదేహం లభించింది. తిరిగి వస్తాడని ఆశిస్తున్న చిన్నారి మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. సాల్మన్ రాజును హతమార్చిన విషయం బయటపడుతుందని భావించి కృష్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
విషాదాంతమైన బాలుడి కిడ్నాప్
Published Thu, Apr 21 2016 5:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement