సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యం | ys jagan mohan reddy to welfare schemes | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యం

Published Tue, Feb 11 2014 1:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ys jagan mohan reddy to welfare schemes

 రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు చెప్పా రు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం లో సోమవారం వెయ్యిమంది కాంగ్రెస్ కార్యకర్తలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గూడవల్లి బాబూరావు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. మోపిదేవి మాట్లా డుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహానేత వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే, వాటిని ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు నీరుగారుస్తూ ఆయా వర్గాలకు తీరని అన్యాయంచేశారని దుయ్యబట్టారు.
 
 పథకాలను దూరం చేయడాన్ని ప్రశ్నించిన వైఎస్ తనయుడు, జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ పాలకులు కక్షగట్టారన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ముందుకు సాగుతున్నానని ప్రజల అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మోపిదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ లోయ తాండవకృష్ణ, నాయకులు గడ్డం రాధాకృష్ణమూర్తి, కొమ్మురి వీరబ్రహ్మేంద్రస్వామి, గుజ్జర్లమూడి ప్రశాంత్, డొక్కు నాగేశ్వరావు, చిత్రాల ఒబేదు, బేతపూడి కోటేశ్వరరావు, చిమటా బాలాజీ, యలమనేని కిషోర్‌కుమార్, జడల వాసు, అల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement