రైల్లో ప్రయాణిస్తున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెకోనలో సోమవారం జరిగింది.
రేపల్లె (గుంటూరు) : రైల్లో ప్రయాణిస్తున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెకోనలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా శివరామపురం గ్రామానికి చెందిన రావి శివనాగేంద్రం(48) రైల్లో తెనాలి నుంచి రేపల్లె వెళ్తున్నారు.
కాగా ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.