గుండెపోటుతో మహిళ మృతి | woman dies heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మహిళ మృతి

Published Thu, Jun 18 2015 12:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

woman dies heart attack

రంగారెడ్డి: గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కనకమామిడి గ్రామానికి చెందిన బొక్కి మంజుల(40) రెండు సంవత్సరాల క్రితం భర్త బోజిరెడ్డి మరణించడంతో వ్యవసాయం చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా బుధవారం ఉదయం ఆమెకు అకస్మాత్తుగా ఇంట్లోనే గుండె పోటు వచ్చింది. గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరిశీలించి చూస్తే అప్పటికే మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement