కత్తితో టీడీపీ కార్యకర్త వీరంగం | TDP Activist Threatens Grama Volunteer In Repalle Guntur District | Sakshi
Sakshi News home page

గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం

Published Mon, Sep 16 2019 8:14 AM | Last Updated on Mon, Sep 16 2019 9:49 AM

TDP Activist Threatens Grama Volunteer In Repalle Guntur District - Sakshi

నాగబాబు చేతిలో కత్తి (సర్కిల్లో)

రేపల్లె/గుంటూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలం చల్లమ్మ అగ్రహారంలో ఆదివారం జరిగింది. టీడీపీ కార్యకర్తలు దొంతుబోయిన నాగబాబురెడ్డి, బురకాయలరెడ్డి టీడీపీ పాలనలో సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వారికి సాయం అందలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వలంటీర్లు పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితా తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇంటికి బిల్లులు అందించాలని వలంటీర్‌ కుంచల వెంకటనాంచారెడ్డితో టీడీపీ కార్యకర్త దొంతుబోయిన నాగబాబురెడ్డి గొడవకు దిగి కత్తితో బెదిరించాడు. వీరంగం సృషించాడు. గతంలో నిర్మించిన ఇంటికి ఇప్పుడు బిల్లు ఎలా వస్తుందన్నందుకు కత్తితో వచ్చి బెదిరించాడని వలంటీర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement