గుంటూరు: రేపల్లె నుంచి సికింద్రాబాద్ వస్తున్న డెల్టా ప్యాసింజర్ రైలులో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి-పొందుగల స్టేషన్ల మధ్యలో దుండగులు ఎస్-2 కోచ్‌లోకి ప్రవేశించి ప్రయాణికుల వద్ద నుంచి 20 తులాల బంగారం, రూ.60 వేల నగదును అపహరించుకుపోయారు. తర్వాత చైన్ లాగి రైలు దిగి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.