రేపల్లె(గుంటూరు జిల్లా): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి గుంటూరు జిల్లా రేపల్లె మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఆటోస్టాండ్ వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని మోల్లగుంట గ్రామానికి చెందిన నాగరాజు(45) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, రాత్రి ఆటో స్టాండ్ వద్ద ఉన్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.