రేపటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
Published Mon, Dec 9 2013 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
బుట్టాయగూడెం (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. 10వ తేదీన విద్యార్థులు, యువకులతో ర్యాలీ, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ, 12న రహదారులు, హైవేల దిగ్బంధనం, వంటావార్పు, 14 నుంచి జిల్లాలోని ఒకొక్క నియోజకవర్గంలో ఒకొక్కరోజు చొప్పున భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement