టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టనున్న బస్సుయాత్ర దేనికోసమో తెలపాలని వైఎస్సార్‌సీపీ నేత తెల్లం బాలరాజు ప్రశ్నించారు.
ప.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టనున్న బస్సుయాత్ర దేనికోసమో తెలపాలని వైఎస్సార్‌సీపీ నేత తెల్లం బాలరాజు ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో ఎగసి పడుతున్న తరుణంలో చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చేపట్టబోయే యాత్ర దేనికోసమో ప్రజలకు తెలపాలన్నారు.
తెలంగాణ కోసమా?లేక సమైక్యాంధ్ర కోసమా? అనే విషయాన్ని తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ పేరుతో..టీడీపీ బస్సుయాత్ర పేరుతో ప్రజలను వంచిస్తున్నారని బాలరాజు విమర్శించారు.