అందరికీ ధన్యవాదాలు : తెల్లం బాలరాజు | Thanks to everyone, Success of Jagan's Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

అందరికీ ధన్యవాదాలు : తెల్లం బాలరాజు

Published Sun, Oct 27 2013 4:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Thanks to everyone, Success of Jagan's Samaikya Sankharavam

ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యదీక్షకు ప్రకృతి కూడా సహకరించిందని, ఆయన పూరించిన సమైక్య శంఖారావం సభ ఊహించిన దానికంటే విజయవంతమైందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శంఖారావం సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, చెరువులకు గండ్లుపడి రోడ్లు జలమయమై ప్రతి కూల పరిస్థితులు ఉన్నా మొక్కవోని ధైర్యంతో సమైక్య శంఖారావం సభకు ప్రజలు తరలి వచ్చారని పేర్కొన్నారు. సీమాంధ్రలోని ప్రజలంతా ముక్తకంఠంతో సమైక్యాంధ్రకు జై కొట్టటమే కాకుండా, జగన్ నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ సభతో నిజం చేశారని తెలిపారు. వరదలతో ఇళ్లు కూలిపోయే పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దృఢచిత్తంతో మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున సభకు తరలివచ్చారన్నారు. హైదరాబాద్‌లో లక్షలాదిమంది ప్రజలతో మార్మోగిన సమైక్య శంఖారావంతో కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం దిగివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement