‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ఆయన ఎప్పటికి గిరిజనుల గుండెల్లో ఉంటార’ని వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు అత్యంత పేదరికం, దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆయన గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారన్నారు.