kumba ravibabu
-
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ
సాక్షి, విజయవాడ: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు. కాగా, ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జూలై 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఇది కూడా చదవండి: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు: ఎంపీ విజయసాయిరెడ్డి -
'సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు'
సాక్షి, అరకులోయ : అరకువ్యాలీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, అరకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ఆకాంక్షిస్తున్న వైఎస్ జగన్ సుదీర్ఘ కాలంపాటు ఆరోగ్యవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేశారని, మరో 30 ఏళ్లు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి వారి కష్టాలను తెలుసుకొని హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.అన్ని ప్రాంతాల్లో అభివృద్ది సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ గిరిజనుల గుండెల్లో ఉంటారు’
-
‘వైఎస్సార్ గిరిజనుల గుండెల్లో ఉంటారు’
సాక్షి, విజయవాడ : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ఆయన ఎప్పటికి గిరిజనుల గుండెల్లో ఉంటార’ని వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు అత్యంత పేదరికం, దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆయన గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు గిరిజనులకి చేసింది ఏమీ లేదని చెప్పారు. తాము గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేయాలో చర్చించామని, తమ పార్టీ మ్యానిఫెస్టో కమిటీకి అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఎస్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘బాబుని గద్దె దించటమే మా లక్ష్యం’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గద్దె దించటమే తమ లక్ష్యమని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో గిరిజనుల సమస్యల ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన నికృష్ట పాలనని, గిరిజనులు మరోసారి మోసపోరన్నారు. చివరివరకు ఒక్క గిరిజనుడికైనా మంత్రి పదవి ఇచ్చావా అని ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యే చనిపోతేగానీ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. కిశోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. బాక్సైట్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ట్రైబల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, హెల్త్ ఈ 4 అంశాలు తమ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. -
వైఎస్ఆర్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు
-
ఆశావహులదీ అదే బాట
టీడీపీ ముఖ్యనేతల మంత్రాంగం విఫలం అరకు, పాడేరు, విశాఖ ఉత్తరం సీట్లలో తలనొప్పి సీటురాని నేతల నుంచీ మొదలైన సహాయ నిరాక‘రణం’ బుజ్జగింపులు, ఎరలకు లొంగని రెబల్స్ సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీలో బుసలు కొడుతొన్న అసమ్మతి ఇంకా దారికి రాలేదు. మెట్టు దిగడానికి రెబల్స్ ససేమిరా అంటున్నారు. ముఖ్యనేతలు మంత్రాంగం నెరుపుతున్నా బెట్టువీడనంటున్నారు. మరోపక్క టిక్కెట్ దక్కని పలువురు ఆశావహులు పార్టీకి విధేయులుగా ఉంటూనే తెరవెనుక సహాయనిరాకరణ మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడు జిల్లాలో టీడీపీ మునుపెన్నడూలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అరకు,పాడేరు, విశాఖ ఉత్తరం,యలమంచిలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరించుకోకూడదని తాజాగా నిర్ణయించుకోవడంతో టీడీపీ నేతలకు పాలుపోవడంలేదు. అరకు సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు ఇచ్చి కొత్తగా పార్టీలో చేరిన కుంబా రవిబాబుకు చంద్రబాబు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెబల్‌గా బరిలో నించున్న ఈయనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని ఆశచూపారు. బాబు మాటలు నమ్మబోనంటూ ఆయన బరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పాడేరులో బీజేపీతో టీడీపీ పొత్తునకు నిరసిస్తూ టీడీపీ అభ్యర్థులు ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు నామినేషన్లు వేశారు. వీరిలో సుబ్బారావు రెబల్గానే ఉండాలని నిర్ణయించుకున్నారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు వ్యతిరేకంగా మాజీ ఐఏఎస్ అధికారి దువ్వారపు రామారావు రెబల్గానే కొనసగాలని నిర్ణయించుకున్నారు. బీరాలు పలికి నీరుగారిపోయిన సుందరపు యలమంచిలి టిక్కెట్ తనకు కాకుండా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ ఇంఛార్జి సుందరపు విజయ్ అసంతృప్తితో పార్టీ కార్యాలయాన్ని తన అనుచరులతో తగులబెట్టించారు. టిక్కెట్ ఇచ్చేవరకు ఆమరణ దీక్ష విరమించుకోనని బీరాలు పలికారు. రెబల్‌గా నామినేషన్ కూడా వేశారు. పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని శపథం పూనారు. మొన్న చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తానన్నా వద్దని పోటీ చేస్తానని గొప్పలకు పోయారు. తీరా ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడంపై అనుచరులు మండిపడుతున్నారు. తనకోసం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే..ఇప్పుడు టిక్కెట్ వచ్చిన అ భ్య ర్థితో చేతులు కలపడంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాడేరు,మాడుగుల,చోడవరం,పాయకరావుపేట నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. రెబల్‌గా నామినేషన్ వేయాలని వీరు మొదట్లో నిర్ణయించినా తద్వారా వచ్చే ప్రయోజనం లేదని భావించిచివరి నిమిషంలో వెనక్కుతగ్గారు. ప్రచారం విషయంలో ప్రస్తుత అభ్యర్థికి సహకరించకూడదనే భావనలో ఉన్నారు. అభ్యర్థులు వీరిని కలిసేప్రయత్నాలు చేస్తున్నా చిక్కకపోవడంతో ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. -
జన తరంగం
=అరకు సమైక్య శంఖారావం అపూర్వ రీతిలో విజయవంతం =వెల్లువలా తరలివచ్చిన గిరిజనం =మన్యంలో మార్మోగిన జగన్నినాదం అరకు/ఆరకు రూరల్, న్యూస్‌లైన్: అరకులో జనసాగరం హోరెత్తింది. వెల్లువెత్తిన ప్రజానీకంతో జన జలపాతం పరవళ్లు తొక్కింది. సమైక్య శంఖారావం సభకు హాజరైన గిరిజనంతో అరకు నలుదిశలా జన సమూహమే కనిపించింది. మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనంతో అరకులో జాతర జరుగుతున్న భావం కదలాడింది. వైఎస్సార్సీపీ సారథి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఉప్పొంగిన గిరిజనోత్సాహం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్ నామస్మరణతో అరకులోయ మార్మోగింది. వైఎస్సార్ సీపీ జెండాలతో కళకళలాడింది. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో ప్రతిద్వనించింది. మునుపెన్నడూ లేని విధంగా మారుమూల గూడేల నుంచి తరలివచ్చిన గిరిజన సంతతి అరకులో కదం తొక్కింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించింది. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ పార్టీ వైఎస్సార్ సీపీయేనని, సమైక్యరాష్ట్రం కోసం తపన పడుతున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించింది.. వేల సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలను చూసి ఇతర పార్టీల నాయకులలో ఆశ్చర్యం వెల్లువెత్తింది. కుంభా రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమైక్య శంఖారావం సభకు వచ్చిన ప్రజానీకంతో అరకు జనసంద్రమైంది. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద నుండి ఎంపీడీఓ కార్యలయం, టౌన్షిప్, వైఎస్సార్ జంక్షన్ మీదుగా సభా స్థలికి వైఎస్సార్సీపీ నేతలతో కలసి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సభ జరిగినా జనం కదలకుండా ప్రసంగాలు విన్నారు. వందలాది మంది శ్లాబ్‌లు, ప్రహారీ గోడలు, దుకాణాలపై ఎక్కి నేతల ప్రసంగం ఆలకించారు. సోనియా, చంద్రబాబు కుట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తమకు భవిష్యత్తు ఉండదన్న భయంతో సోనియా గాంధీ, చంద్రబాబు రాష్ట్ర విభజనకు తలపెట్టారని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకే సోనియా, బాబు విభజన కుయుక్తి పన్నారని విమర్శించారు. అరకులో నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్య నిర్వహక అరకులో శంఖారావం సభ జగన్ సభను తలపించిందని పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు ప్రశంసించారు. ఇటలీ బొమ్మ సోనియాకు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయం తెలియవని, అందుకే ఆమె విభజనకు సిద్ధపడ్డారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంత అభివృద్దికి ఎంతో కృషి చేశారని చెప్పారు. అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జీసీసీ దళారీ వ్యవస్థగా మారిపోయిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఏపీని రెండు కాదు మూడు రాష్ట్రాలుగా చేయాలని కంకణం కట్టుకొని చెబుతుండడం దారుణమని చెప్పారు. బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జి బేబి నాయన మాట్లాడుతూ వైస్సార్ బ్రతికి ఉంటే విభజన జరిగేది కాదని చెప్పారు. చంద్రబాబును రెండు సార్లు ప్రజలు ఓడించినా సిగ్గురాలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుందని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద రెడ్డి, మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, జెడ్పీ మాజీ చైర్మన్, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త వంజంగి కాంతమ్మ, మాడుగుల సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, ఎస్‌కోట వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు చినరాంనాయుడు, సుబ్బరాజు, సీఈసీ సభ్యుడు పీవీఎస్ఎన్రాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు బిబి. జగ్గన్న, శోభ వీరభద్రరాజు, పాంగి చిన్నారావు, పల్టాసింగి విజయ్‌కుమార్, పొద్దు అమ్మన్న, దూరు గంగన్నదొర, పాగి అప్పారావు, సొనాయి కృష్ణారావు, పట్టాసి కొండలరావు, కొర్రా కాసులమ్మ, వచ్చంగి పద్మ, రాందాస్, రవణమూర్తి, వెచ్చంగి కొండయ్య, దురియా రుక్మిణి, 56 మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు సమైక్య శంఖారావం బహిరంగ సభలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆద్వర్యంలో అలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ బృందం వేదికపై నృత్యాలు చేస్తూ పాడుతూ ఉంటే సభలో ఉన్న గిరిజనం కేరింతలు కొట్టారు. రెండు ప్రసంగాలకు మధ్య సాంస్కృతిక బృందం పాటలు పాడుతూ జనాన్ని ఉత్సాహపరిచారు. పార్టీలో పలువురు చేరిక : శంఖారావం సభలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మాడగడ మాజీ సర్పంచ్, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన సొనాయి బజ్జింగు, అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రేగబోయిన స్వామి, వాలసి, శిరగాం, కివర్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీలోకి చేరా రు. వీరికి దాడి వీరభద్రరావు, అరకు నియోజక వర్గం సమన్వయకర్త కుంభా రవిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.