పోలవరం :పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల నష్టపోయే ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి వైఎస్సార్ సీపీ అం డగా ఉంటుందని ఆ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. మండలంలోని కన్నాపురం అడ్డరోడ్డు వద్ద మంగళవారం రైతులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు మాట్లాడుతూ అవసరమైతే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇక్కడకు తీసుకువస్తామన్నారు.
ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న పథకాలను పూర్తి చేయకుండా సొమ్ము చేసుకునేందుకే రూ.1300 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతులు పోలవరం ప్రాజెక్టుకు, కొవ్వాడ స్లూయిస్‌కు భూములు ఇచ్చి కష్టాల్లో ఉన్నారన్నారు. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరు అందటంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిరకాలవాంఛ అని, ఇది త్వరగా పూర్తి చేస్తే వైఎస్సార్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో జాప్యం చేస్తున్నారన్నారు.
మహాధర్నా విజయవంతం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కన్నాపురం అడ్డరోడ్డు వద్ద రైతులు మంగళవారం చేపట్టిన మహాధర్నా విజయవంతం అయింది. రైతులు రోడుపై సుమారు 2 గంటల సేపు బైఠాయించి ఎత్తిపోతలు వద్దు, పోలవరం ముద్దు అంటూ నినదించారు.ఈ ధర్నాతో ఏటిగట్టుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిది పోల్నాటి బాబ్జి, మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ, బుగ్గా మురళి, వలవల సత్యనారాయణ, తైలం శ్రీరామచంద్రమూర్తి, షేక్ ఫాతిమున్నిసా, దేవిశెట్టిరమేష్, కాంగ్రెస్ నాయకులు కొణతాల ప్రసాద్, మొగళ్ళహరిబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటాం
Published Wed, Jan 21 2015 3:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement