
'పోలవరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తా'
పోలవరం : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు. ఇప్పటికే గిరిజనుల అభివృద్ధికి 497 బేరన్లు ఇచ్చామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి పోగొండ రిజర్వాయర్ పూర్తి చేస్తామని బాలరాజు పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తెస్తామని ఆయన తెలిపారు.