ఓటుకు నోటు వ్యవహారంలో నిందితునిగా నిలబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయూలని వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజం
కన్నాపురం (కొయ్యలగూడెం): ఓటుకు నోటు వ్యవహారంలో నిందితునిగా నిలబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయూలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం కన్నాపురంలో పార్టీ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కొనే విషయంలో సీఎం చంద్రబాబు ఏసీబీకి రెడ్‌హేండెడ్‌గా చిక్కడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని గవర్నర్ కలుగజేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయూలని కోరారు.
పట్టిసీమ ఎత్తిపోతల టెండర్లలో జరిగిన అవినీతి సొమ్ముల్ని టీడీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు వినియోగిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ తనమిత్ర పక్షమైన టీడీపీ చేసిన అవినీతి వ్యవహారానికి ఏవిధంగా స్పందిస్తుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గాడిచర్ల సోమేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎండీ హాజీబాషా ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్‌పై చంద్రబాబు దిష్టిబొమ్మని ఊరేగించి దహనం చేశారు. నాయకులు విప్పే మోహన్, ఉపసర్పంచ్ ఉప్పలకృష్ణ, కోసూరి గోపాలరాజు, వల్లూరి మాధవరావు, పలిమి ప్రమీల, మీసాల సీతామహాలక్ష్మి, ఆవుల సురేంద్ర, షేక్ రహమాన్, దయ్యాల సత్యనారాయణ పాల్గొన్నారు.