ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కాకుండా పోరాడే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ నేతలు తెల్లం బాలరాజు, రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏలూరులో శనివారం వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయసాధన కోసం జగన్ నాయకత్వంలో పోరాడదమన్నారు.
ఆ మహానేత లక్షణాలను జగన్ పుణికి పుచ్చుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేద్దామని సీమాంధ్ర ప్రజలకు వారిరువురు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించైనా సమైక్యాంధ్రను సాధించుకుందామని అన్నారు.