samaikyandhra pradesh
-
మరో చరిత్ర
రాజకీయ పార్టీలకు తీపి.. చేదు మిగిల్చిన 2013 ఘన విజయాలతో ఊపుమీదున్న వైఎస్సార్సీపీ వైకుంఠపాళిలో చిక్కుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సమైక్య పోరులో వైఎస్సార్సీపీది ప్రత్యేక భూమిక మంత్రి పదవి చేజార్చుకున్న డీఎల్ వ్రతం చెడ్డా ఎమ్మెల్యే వీరశివాకు దక్కని ఫలితం జిల్లా రాజకీయ చిత్రపటంపై 2013లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కాంగ్రెస్, టీడీపీలకు చేదు అనుభవమే మిగిలింది. సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే నిలిచి మరో చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉధృతంగా సాగిన సమైక్య ఉద్యమంలో వైఎస్సార్సీపీ ప్రధాన భూమిక పోషిస్తే కాంగ్రెస్, టీడీపీలు అవకాశవాద ధోరణితో వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో విభేదాలు ముదిరిన నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావుకు ఏపీహెచ్‌ఎంఐడీసీ చైర్మన్ పదవి వరించింది. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామని మరోమారు రుజువు చేశారు. అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా, స్థానిక సమరంలో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్, టీడీపీలు అపవిత్ర కలయికకు సిద్ధపడ్డా వారికి చేదు అనుభవమే దక్కింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలకు సంకటస్థితి నెలకొంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రాంతానికో నినాదంతో ఆ రెండు పార్టీలు కాలయాపన చేస్తూ వచ్చాయి. జిల్లాలో రెండు మార్లు ముఖ్యమంత్రి కిరణ్ పర్యటించినా నిధుల మంజారులో చిత్తశుద్ధి కొరవడింది. జిల్లాకు చెందిన మంత్రులు పదవులను కాపాడుకునే తాపత్రయం మినహా పాలనలో ప్రత్యేకతను చాటుకోలేకపోయారు. సత్తా చాటిన వైఎస్సార్సీపీ సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకొని తనకు తానే సాటి అన్నట్లుగా జిల్లాలో వైఎస్సార్సీపీ వ్యవహరించింది. ప్రజాతీర్పులో ఓటమి చవిచూసిన కాంగ్రెస్, దొడ్డిదారిన డీసీసీబీ ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావించి విఫలమైంది. తుదకు డీసీఓ చంద్రశేఖర్ కిడ్నాప్‌కు సైతం పాల్పడింది. ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ ఛెర్మైన్, డీసీఎంఎస్ ఛెర్మైన్ పదవులు వైఎస్సార్సీపీకి చెందిన ఇరగంరెడ్డి తిరుపేలరెడ్డి, ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డిలను వరించాయి. జిల్లాలో 783 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే 453 పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 152 స్థానాలతో సరిపెట్టుకోగా, 140చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరో 38 స్థానాలు స్వతంత్రులకు దక్కాయి. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ వచ్చింది. దోబుచులాటలో దొందూ దొందే...! అపవిత్ర కలయికకు శ్రీకారం చుట్టి ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజానీకం బుద్ధి వచ్చేలా తీర్పునిచ్చారు. అది చాలదన్నట్లుగా రాష్ట్ర విభజనలో ఓట్లు..సీట్లు లక్ష్యంగా నిర్ణయాలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతే అందుకు ప్రత్యక్షంగానే టీడీపీ సహకారమందిస్తూ వచ్చింది. ప్రాంతానికి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ కాలయాపన చేస్తూ పరోక్షంగా విభజనకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సహకరిస్తోంది. అధినేతల తీరుకు అనుగుణంగానే ఆ రెండు పార్టీలకు చెందిన జిల్లా నేతలు వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రొద్దుటూరు జేఏసీ కన్వీనర్ మాదాసు మురళి కాళ్లు పట్టుకొని ఎమ్మెల్యే లింగారెడ్డిని అభ్యర్థించినా నిష్ర్పయోజనమే అయింది. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరించారు. మంత్రి రామచంద్రయ్య ఉద్యమకారులను అవమాన పర్చేలా మాట్లాడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరో మంత్రి అహ్మదుల్లా అదే తరహాలో వ్యవహరించడంతో ఆయన వాహనంపై ఉద్యమకారులు చెప్పులు విసిరారు. వ్రతం చెడ్డా దక్కని ఫలితం... డీసీసీబీ ఛెర్మైన్ తన కుమారుడు అనిల్‌కు దక్కించుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అపప్రదను మూటగట్టుకోవడం మినహా ఎలాంటి ఫలితం లేదు. ఓటమి చెందుతామని భావించిన 22 సహకార సంఘాలకు ఎన్నికలను ప్రభుత్వంచే వాయిదా వేయించారు. బి గ్రూపు ఓటర్లును ఆయన మద్దతుదారులు కిడ్నాప్ చేశారు. ఎన్ని రకాల అడ్డదారులు ఎంచుకున్నా డీసీసీబీ ఛెర్మైన్ పదవి మాత్రం దక్కలేదు. అధికారిక హోదాకే పరిమితం... జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య, అహ్మదుల్లా మంత్రులుగా, 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డి అధికారిక పదవులు అనుభవిస్తున్నారు. ఉత్సవ విగ్రహాల్లా అధికారిక హోదాలు అనుభవించడం మినహా అభివృద్ధిలోనూ, జిల్లాలోని పెండింగ్ పథకాలు పూర్తి చేయడంలో ఆశించిన మేరకు కృషి చేయలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సైతం నిష్ర్పయోజనమే.. జిల్లాలో అధికారిక కార్యక్రమాలకు రెండు మార్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. హామీలైతే హద్దులు మీరేలా గుప్పించారు కానీ, ఆచరణలో చూపలేకపాయారు. ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ అమలు నేపథ్యంలో ఏప్రెల్ 13న అట్లూరు మండలం కుంభగిరికి వచ్చారు. అక్టోబర్ 29న మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి వర్థంతి కార్యక్రమానికి లక్కిరెడ్డిపల్లెకు వచ్చారు. తర్వాత నవంబర్ 26న రాయచోటిలో రచ్చబండకు హాజరయ్యారు. అధికారికంగా రెండు పర్యటనలకు హాజరైనా నిధుల విడుదలలో కానీ, జిల్లాలో పెండింగ్ పథకాలు పూర్తి చేయడంలో కానీ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పెపైచ్చు ఆయన స్వయంగా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. మంత్రి పదవిని కోల్పోయిన డీఎల్... స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యగా మారిన మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి జూన్ 1న మంత్రి పదవిని కోల్పోయారు. ముఖ్యమంత్రి కిరణ్ తన మంత్రివర్గం నుంచి డీఎల్‌ను బర్తరఫ్ చేశారు. లండన్ టూర్లో ఉండగా డీఎల్‌పై వేటు పడింది. శివరామకు దక్కిన అవకాశం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరామకృష్ణారావుకు ఏపీహెచ్‌ఎంఐడీసీ ఛెర్మైన్ పదవి వరించింది. 2009 నుంచి ఊరిస్తూ వచ్చిన అధికారిక పదవి 2013లో ఆయన్ను వరించింది. ప్రజానేత ఉన్నాడనే ధీమా... ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగే ప్రజా నాయకుడు కళ్లెదుట ఉన్నారనే ధీమా ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ప్రజానీకం అలుపెరుగని పోరాటం చేపట్టారు. వీరి నిర్ణయానికి అనుగుణంగా కడప ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్బంధపు రోజుల్లో జైలులో సైతం ఆమరణ దీక్ష చేపట్టారు. బెయిల్‌పై విడుదలయ్యాక కూడా అదే స్ఫూర్తితో వ్యవహరించారు. సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఉద్యమబాట పట్టారు. చిత్తశుధ్ధితో చేస్తున్న పోరాటాన్ని ప్రజలు సైతం ఆశీర్వదిస్తూ అండదండగా నిలుస్తున్నారు. ప్రజల పక్షపాతి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారనే ధీమాను జిల్లా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. -
లోక్‌సభలో మార్మోగిన సమైక్య గళం
సభలో సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించిన జగన్, మేకపాటి, ఎస్పీవై వాయిదా తీర్మానంపై చర్చ కోసం గట్టిగా పట్టు సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్రప్రదేశ్ డిమాండ్‌తో రోజూ లోక్‌సభలో ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కూడా ఉధృతంగా నిరసనలు కొనసాగించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి బుధవారం లోక్‌సభలో సమైక్యవాదం వినిపిస్తూ ముక్తకంఠంతో నినదించారు. ‘సేవ్ డెమొక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్’(ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి), ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’(ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచండి), ‘వీ వాంట్ జస్టిస్’(మాకు న్యాయం చేయండి) అంటూ వారు ఉధృతంగా నినాదాలు చేశారు. మేకపాటి, ఎస్పీవై ప్లకార్డులను ప్రదర్శించారు. వాయిదా తీర్మానంపై చర్చకు ఒత్తిడి.. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు రెండు నోటీసులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై చర్చించాలంటూ వాయిదా తీర్మానానికి నోటీసిచ్చింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ నోటీసునివ్వడంతో, వారికి మద్దతునివ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని యావత్ దేశ ప్రజానీకానికి, అలాగే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్, మేకపాటి అవిశ్వాసానికి నోటీసునిచ్చారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టడానికి ఉపక్రమించారు. ఈ తరుణంలోనే జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి తదితరులు, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణరావు ప్రభృతులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. వాయిదా తీర్మానానికి తామిచ్చిన నోటీసును చేపట్టాలంటూ జగన్, మేకపాటి, ఎస్పీవై స్పీకర్ మీరాకుమార్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అటు కాంగ్రెస్, టీడీపీ సభ్యులు షరామామూలుగా వెల్‌లో తమ నినాదాలను సాగించారు. మరికొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఇదే తరుణంలో ఇతర పార్టీల సభ్యులు కూడా వేరే సమస్యలపై ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడం, నినాదాలతో సభ దద్దరిల్లుతుండటం గమనించిన స్పీకర్ 11.04కు సభను 12 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన కాసేపటికి ఉదయం పరిస్థితులే పునరావృతమయ్యాయి. జగన్, మేకపాటి, ఎస్పీవైతోపాటు కాంగ్రెస్, టీడీపీ సభ్యులతోపాటు ఇతర పార్టీల సభ్యులు వేరే అంశాలపై పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. నినాదాల మధ్యే అవిశ్వాస నోటీసుల ప్రస్తావన లోక్‌పాల్ బిల్లుకున్న ప్రాధాన్యం దృష్ట్యా ముందుగా దానిపై చర్చించి ఆమోదించిన తర్వాత అవిశ్వాస నోటీసులను చేపట్టాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ కోరగా, స్పీకర్ మాత్రం బిల్లుకు ముందే అవిశ్వాస నోటీసుల్ని ప్రస్తావించారు. సభలో నినాదాలు ప్రతిధ్వనిస్తుండగానే స్పీకర్ అవిశ్వాస నోటీసులను ప్రస్తావించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సీమాంధ్ర సభ్యులకు పోటీగా కొందరు తెలంగాణ ఎంపీలు కూడా పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఆమె, ‘సభలో సాధారణ పరిస్థితులు లేనందున ఈ నోటీసులను నేను చేపట్టలేకపోతున్నాను’ అని ప్రకటించి లోక్‌పాల్ బిల్లును పెట్టాల్సిందిగా న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ని కోరారు. నినాదాల మధ్యే చర్చ, ఆపై లోక్‌పాల్ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తర్వాత స్పీకర్ మీరాకుమార్... అమెరికాలో దౌత్య అధికారిణికి జరిగిన అవమానంపై చర్చకు అనుమతించారు. ఇది పూర్తయ్యే సరికి 1.18 గంటలైంది. అప్పటివరకూ పలు పార్టీల సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో స్పీకర్, జాతీయ గీతం మొదలు కానుందని, సభ్యులందరూ తమ స్థానాలకు తిరిగివెళ్లాలని పదే పదే కోరారు. దీంతో సభ్యులు తమ స్థానాలకు చేరుకున్నారు. ఆ వెంటనే జాతీయ గీతం ఆలాపన జరగడం, అదైన వెంటనే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం రెండు నిమిషాల్లో పూర్తయింది. అటు రాజ్యసభ కూడా వాయిదాల పర్వంతో సాగి ప్రభుత్వానికి అవసరమైన బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదాపడింది. హైదరాబాద్‌కు పయనమైన జగన్: పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన జగన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు. సమావేశాలు ముందుగానే ముగియడంతో ఆయన తిరిగి రాష్ట్రానికి వెళ్లిపోయారు.అభాసుపాలైన టీడీపీ ఎంపీలు: టీడీపీ ఎంపీలు లోక్‌సభలో అభాసుపాలయ్యారు. సమైక్యాంధ్రపై వారి ద్వంద్వ వైఖరే దీనికి కారణం. బుధవారం లోక్‌సభలో సమైక్యాంధ్ర అంటూ కొందరు టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనామా నాగేశ్వరరావు సభలో.. దేవయాని అంశంపై చర్చలో పాల్గొన్నారు. ఒకే పార్టీకి చెందిన ఎంపీలు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత ఇలా ద్వంద్వ విధానాలు అవలంబించడం చూసి మిగతా పార్టీల నేతలు నవ్వుకున్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్
ప్రైవేటు బిల్లుకు సీఎం తోడ్పడాలి సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ మా పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక ర్ తిరస్కరించినందున ప్రైవేటు బిల్లు ప్రతిపాదిస్తాం. ఈ బిల్లుపై ఓటింగ్ జరిగేలా స్పీకర్‌కు సభా నాయకుడి హోదాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించాలి. ఆ పని చేయకుండా సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నట్లు మీడియాలో హడావుడి చేస్తే సరిపోదు. ఇదే సమయంలో మా బిల్లుకు మద్దతివ్వకున్నా పర్లేదు.. కానీ వారి పార్టీ ఎమ్మెల్యేలతో అయినా ప్రైవేటు బిల్లు నోటీసు ఇప్పించేలా చంద్రబాబు కృషిచేయాలి. ప్రధాన ప్రతిపక్ష నేతగా విభజన తీరుపట్ల స్పందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటేనే ప్రజలు నమ్ముతారనుకోవద్దు. దాన్ని ఆచరణలోనూ చూపాలి. టీ బిల్లు విషయంలో ప్రతి దశలోనూ కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం సహకరించారు. రాష్ట్రంలోని దుస్థితికి చంద్రబాబే కారణం. ఇద్దరు కొడుకులు, కొబ్బరికాయ వంటి సిద్ధాంతాలు తెరమీదకు తెస్తూ ప్రజలను విభజన దిశగా తీసుకెళ్లిన చంద్రబాబు ప్రజాద్రోహిగా నిలిచిపోతారు. విభజనను అడ్డుకునేందుకు చివరిదశ వరకు రాజకీయంగా, క్షేత్రస్థాయిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. -వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, బాబూరావు టీడీపీ మూర్ఖపు మాటలు మానుకోవాలి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి ఒక వైఖరంటూ లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ మరిచిపోయిందా? ఇప్పుడు రాష్ర్ట ఏర్పాటును అడ్డుకుంటామంటూ మూర్ఖపు మాటలు చెప్పడం మానాలి. ఇరుప్రాంతాల్లో వైషమ్యాలు పెంచేలా సీఎం చేయడం సరికాదు. - ఈటెల రాజేందర్(టీఆర్ఎస్ ఎమ్మెల్యే) ఆలస్యం చేస్తూ విద్వేషాలు పెంచవద్దు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వెంటనే చర్చించి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానిస్తూ పార్లమెంటుకు పంపించాలి. ఆలస్యం చేస్తే ఇరుప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు సీమాంధ్ర ప్రజల కష్టాలను తీర్చే మార్గాలను సైతం కాంగ్రెస్ అన్వేషించాల్సి ఉంది. అధికార పార్టీ రెండు వైఖరులు విడిచిపెట్టి విభజనకు సహకరించాలి. -గుండా మల్లేష్, కె.సాంబశివరావు(సీపీఐ ఎమ్మెల్యేలు) అధికార పార్టీ ద్వంద్వ వైఖరి సరికాదు టీ బిల్లు విషయంలో రాష్ట్రప్రభుత్వం, అధికారపార్టీ ద్వంద్వ వైఖరి అనుసరించడం సరికాదు. ఈ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చించి ఆ ప్రక్రియను ముగించాలి. తర్వాత ప్రజా సమస్యలను సభలో ప్రవేశపెట్టి చర్చించాలి. అకాల విపత్తులవల్ల కలిగిన నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించే పరిహారాన్ని అందించాలి. - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం ఎమ్మెల్యే) సోనియాకు రాష్ర్ట ప్రజల కష్టాలు పట్టవా? స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 8 కోట్ల ప్రజల ఆవేదన పట్టదా? టీ బిల్లును తీసుకొచ్చిన ప్రత్యేక విమానంలో డబ్బు మూటలూ తెచ్చారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనేందుకే దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చారు. ఆయన్ను రాష్ర్ట ప్రజలు తరిమికొట్టాలి. - దేవినేని ఉమామహేశ్వరరావు, డి.నరేంద్ర(టీడీపీ ఎమ్మెల్యేలు) తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంది బిల్లు పెడితే మేం పూర్తిగా సహకరిస్తాం. ప్రాంతాలవారీగా చీలిపోయి వాదనలు వినిపిస్తున్న అధికారపార్టీ వలే ్ల తెలంగాణ ఏర్పాటులో సమస్యలు నెలకొంటున్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసయ్యేవరకు తెలంగాణవాదులంతా ఐక్యంగా ముందుకుపోవాలి. మా పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంది. - ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు(టీడీపీ ఎమ్మెల్యేలు) -
అక్టోబర్ 17, 26నే సమైక్య తీర్మానం కోసం జగన్ పిలుపు
-
పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సమైక్య రాష్ట్రం కోసం నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సోమవారంనాడిక్కడ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలకు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ప్రధానంగా గ్రామస్థాయిల్లో కమిటీల ఏర్పాటు, కో-ఆర్డినేటర్ల పనితీరు బేరీజు వేసుకుంటూ సమీప భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ ప్రసంగాల్లో నేతలకు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యులు పలువురు మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూనే వైఎస్సార్సీపీపై నిందలు మోపుతూ కుట్రలు చేస్తున్నాయని, అడుగడుగునా వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అప్రమత్తంగా ఉంటూ వచ్చే మూడు నెలల కాలం ఎంత కీలకమైందో వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీజీసీ, సీఈసీ, పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కన్వీనర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం..: జరగబోయే పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఆలోచనతో అందుకు తమ పార్టీని సంసిద్ధం చేయడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం కోసం జగన్మోహన్రెడ్డి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరికీ మరోసారి తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతున్నందున 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ చేర్పించాలని నేతలను ఆదేశించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచారో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. విభజన జరగలేదంటూనే, అందుకు కావాల్సిన పూర్తి సహకారాలు కేంద్రానికి సీఎం అందిస్తున్నారని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన జూలై 30న సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసుంటే ప్రక్రియ నిలిచిపోయేదన్నారు. తెలంగాణపై జగన్‌తో ప్రత్యేక భేటీ: తెలంగాణలో పార్టీ ఏవిధంగా ముందుకెళ్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బాజిరెడ్డి బదులిస్తూ.. ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఇరు ప్రాంత నేతలు రెండు రకాల వాదనలు చేస్తున్నారు. కానీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఒకే విధానంతో ప్రజల్లోకి వెళ్తోంది. కాబట్టి తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాయకులకు ఎదురవుతున్న సమస్యలపై అధ్యక్షులు జగన్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించి మనోధైర్యం కల్పించాలని కోరాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గట్టు రామచంద్రరావు, దాడి వీరభద్రరావు, పి.ఎన్.వి.ప్రసాద్, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కొల్లి నిర్మల, జలీల్‌ఖాన్, నల్లా సూర్యప్రకాశ్, ఎడ్మ కృష్ణారెడ్డి, బి.జనక్‌ప్రసాద్, ఉప్పులేటి కల్పనతో పాటుగా పలువురు ప్రసంగించారు. ఎస్.పి.వై.రెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య వేదికను అలంకరించిన వారిలో ఉన్నారు. -
'విభజనను అడ్డుకునే శక్తి జగన్‌కు మాత్రమే ఉంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కాకుండా పోరాడే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ నేతలు తెల్లం బాలరాజు, రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏలూరులో శనివారం వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయసాధన కోసం జగన్ నాయకత్వంలో పోరాడదమన్నారు. ఆ మహానేత లక్షణాలను జగన్ పుణికి పుచ్చుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేద్దామని సీమాంధ్ర ప్రజలకు వారిరువురు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించైనా సమైక్యాంధ్రను సాధించుకుందామని అన్నారు. -
విభజనకు సీఎం ఓకే చెప్పారు: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్రప్రదేశ్ వీరుడిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన గురించి తాను సృష్టించుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ మాటలు మరోసారి స్పష్టంచేశాయి. ‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అంగీకరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం వ్యవహరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు’’ అని దిగ్విజయ్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. రాష్ట్ర శాసనసభకు తెలంగాణ బిల్లును పంపిస్తామని.. తీర్మానం ఉండదని ఆయన స్పష్టంచేశారు. ఈ నెలాఖరులోగా బిల్లును అసెంబ్లీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి ముందు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. సమన్వయ కమిటీ ఏర్పాటయిన తర్వాత తొలి సమావేశమైనందున ఢిల్లీలో ఏర్పాటు చేశామని, రెండో సమావేశాన్ని హైదరాబాద్‌లో పెడతామని, తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘ఈ భేటీలో సీఎం మార్పు అంశాన్ని చర్చిస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. సీఎం మార్పు ఎజెండాలో లేదు. సీఎల్పీ ఎన్నుకున్న నేత ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మార్పు ఉండదు’’ అని సమాధానం చెప్పారు. ‘విభజన నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకించారు కదా?’ అని ప్రస్తావించగా.. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సీఎం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే ప్రసక్తే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు. ‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పార్టీ అత్యుతన్న నిర్ణాయక వ్యవస్థ అయిన సీడబ్ల్యూసీలో తీసుకున్నాం. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సీఎం కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. ఆయన, ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయులుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా విధేయతనే నిరూపించుకుంటారని విశ్వసిస్తున్నా. ఆయన కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఆ మూడు పార్టీలూ హాజరవ్వాలి: ‘రాయల తెలంగాణ’ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెస్తుండటం గురించి ప్రశ్నించగా.. ‘‘కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) పలు విషయాలపై చర్చిస్తోంది. వారికి వచ్చిన సలహాలు, సూచనలను క్షుణ్నంగా పరిశీలి స్తోంది’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎం పార్టీలు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని సూచించారు. ‘‘సీమాంధ్ర ప్రజల క్షేమాన్ని కాంక్షించే పార్టీలు.. జీఓఎంకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. జీఓఎం నిర్వహించనున్న సమావేశాన్ని బహిష్కరించకుండా.. హాజరుకావాలి. తమ వాదాలను జీఓఎంకు వినిపించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు, తీర్మానాలను రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు పంపించే అవకాశముందన్న ప్రశ్నకు.. ‘‘బిల్లు మాత్రమే పంపిస్తాం. తీర్మానం కాదు. ఈ నెల నాలుగో వారంలో బిల్లు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని దిగ్విజయ్ వివరించారు. -
మరింత ఉధృతంగా..
సాక్షి నెట్వర్క్ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సహా ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వబోమంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంది. వరుసగా 94వరోజైన శుక్రవారం కూడా రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. విశాఖలో ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో భారీ మానవహారం నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమలాపురం, పెద్దాపురంలలో సమైక్యవాదులు అమరజీవి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబాజీపేటలో విద్యార్థులు సమైక్య గర్జన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు సమైక్యవాదులు, ఏన్జీవోలు పాలాభిషేకాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోవిద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. విజయనగరంలో న్యాయవాదుల బైక్ ర్యాలీని పోలీసులు భగ్నంచేసి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిని పోలీస్ వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. వర్షంలో తడుస్తూ... వైఎస్సార్ జిల్లా బద్వేలులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో వర్షంలోనే తడుస్తూ నిరసన చేపట్టారు. కడపలో ఎన్జీఓలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వృథాగా పోనీయ్యబోమని ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులు ప్రతినబూనారు. అనంతపురంలో ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. గుంతకల్లు, కదిరి, లేపాక్షిలో విద్యార్థులు మహా మానవహారం నిర్మించారు. హిందూపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో ఎన్జీవోలు, న్యాయవాదులు, మెడికల్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో గాండ్ల, చేనేత, బలిజ సంఘాలు విద్యార్థిగర్జన నిర్వహించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మానవహారం నిర్వహించారు. అఖిలపక్షంలో సమైక్యవాదం వినిపించండి ‘కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ సమావేశంలో సమైక్యవాదం వినిపించి తీరాలి. లేకపోతే ఆయా పార్టీల నాయకులను రోడ్లపై తిరగనివ్వం’ అని కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ నాయకులు హెచ్చరించారు.కర్నూలులో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహించారు. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. -
సమైక్యాంధ్ర కోరుతూ బంగి అనంతయ్య వినూత్న నిరసన
-
అందరూ కలిసి రండి
-
అందరూ కలిసి రండి
హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ‘మేము మీ నుంచి మద్దతు కోరుతున్నాం. సోషల్ మీడియా మద్దతు కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యంపై విశ్వా„సమున్న ప్రతిఒక్కరి మద్దతు మాక్కావాలి..’ అని జగన్ అన్నారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలిసి ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతల సహకారం మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగేది రేపు మరెక్కడైనా జరగవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. ఎందుకంటే అది ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుంది..’ అని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతిస్తారƒ న్న ప్రశ్నకు జవాబిస్తూ.. తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడది తమకంత ముఖ్యమైన అంశం కాదని అన్నారు. ‘ఎన్నో లౌకిక పార్టీల గురించి నేనెంతో స్పష్టంగా మీకు చెప్పినప్పుడు.. ఆరునెలల తర్వాత జరగబోయేదానిపై ఇప్పుడెందుకు మనం ఊహాగానాలు చేయాలి...’ అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నీళ్లు, రెవెన్యూ పంపకం పెద్ద సమస్యగా మారుతుందని, ప్రజలు నీటి కోసం అలమటించాల్సి వస్తుందని జగన్ స్పష్టం చేశారు. జగన్ సమైక్య దీక్షకు విశేష స్పందన ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సమైక్యదీక్షకు రెండో రోజు ఆదివారం జనం నుంచి విశేష స్పందన లభించింది. తండోపతండాలుగా జనం ఆయనకు మద్దతు తెలపడానికి తరలి వచ్చారు. యువకులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. చిన్న పిల్లలను చంకన పెట్టుకుని వచ్చిన తల్లులు పెద్ద సంఖ్యలో కనిపించారు. తనను కలవడానికి వచ్చిన వారందరినీ జగన్ చిరునవ్వుతో పలుకరించారు.పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణంరాజు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి(కాంగ్రెస్) కూడా జగన్ వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. సమైక్యానికి మద్దతుగానే జగన్‌ను కలిశా కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఎవరు ఉద్యమించినా తాను మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసా ని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారమిక్కడ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం జగన్ ఆమరణ దీక్ష చేస్తున్నందున సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయి, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘జై సమైక్యాంధ్ర’ అని అంటే... ఒక సమైక్య వాదిగా మద్దతిస్తానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించడంతో ఆ పార్టీలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో తాను రాజీనామా ప్రకటించినట్లు వివరించారు. ఏ పార్టీలో చేరాలనేది తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, తనƒ కు అన్ని విధాలుగా అండదండలు ఇచ్చిన కార్యకర్తలతో చర్చించి వారి ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.