టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు | Ex Minister Peethala Sujatha Sensational Allegations Against TDP, Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు

Published Fri, Mar 15 2024 3:05 PM | Last Updated on Fri, Mar 15 2024 4:24 PM

Ex Minister Peethala Sujatha Sensational Allegations Against Tdp - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారని, చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వీడియో విడుదల చేశారు.

‘‘నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు. పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం. మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్‌ఆర్‌ఐలకు ఇస్తున్నారు. నాతో పాటు మాజీమంత్రి జవహర్‌కి కూడా టికెట్‌ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం. నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు’’ అంటూ పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement