
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాదయాత్ర సమయంలో పామాయిల్ రైతులు పడుతున్న కష్టాలను చూసి సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పామాయిల్‌కు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు.
నివర్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందించామని ఆయన చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ అంటూ ఒక జిల్లా తర్వాత మరో జిల్లా పర్యటిస్తున్నారని, హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు బయటకు రాలేదన్నారు. గతంలో చంద్రబాబును ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లొకేష్‌లు ఏమయ్యారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment