సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు.
మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం.
ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు.
చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం
Comments
Please login to add a commentAdd a comment